Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing 11: జడేజాకు గాయం.. పంత్‌ ఇన్.. కార్తీక్ ఔట్! పాక్‌తో బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే!

India Playing 11 vs Pakistan: Rishabh Pant likely to replace Dinesh Karthik

దుబాయ్: ఆసియాకప్‌ 2022లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. మరోసారి దాయాదీ పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ మళ్లీ అభిమానులను కనువిందు చేయనుంది. దాయాదీ దేశాలు మళ్లీ మళ్లీ తలపడాలనే ఉద్దేశంతోనే టోర్నీ ఫార్మాట్ సెట్ చేసిన నిర్వాహకులు ఊహించనట్లుగానే హైఓల్టేజ్ మ్యాచ్‌లతో క్యాష్‌ చేసుకుంటున్నారు.

లీగ్ దశలో రెండు మ్యాచ్‌లకు రెండు గెలిచిన భారత్ గ్రూప్-ఏ టాపర్‌గా సూపర్-4‌కు అర్హత సాధించగా.. హాంగ్ కాంగ్‌పై భారీ విజయంతో పాక్ గ్రూప్ ఏ రన్నరప్‌గా ముందడుగు వేసింది. దాంతో మరోసారి హైఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. తొలి మ్యాచ్ తరహాలోనే పాక్‌ను మళ్లీ ఓడించి తమ జోరు కొనసాగించాలని రోహిత్ సేన భావిస్తుండగా.. గత పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది.

జడేజాకు గాయం.. మార్పులు ఖాయం!

జడేజాకు గాయం.. మార్పులు ఖాయం!

ఈ బిగ్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. పాక్‌తో అద్భుత ప్రదర్శన కనబర్చిన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మొకాలి గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చాడు. ఇక జడేజా గైర్హాజరీ నేపథ్యంలో జట్టులో మార్పులు అనివార్యమయ్యాయి. జడేజా స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చినా.. వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌ను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టాప్-5 బ్యాటర్లలో అంతా రైట్ హ్యాండర్స్ ఉన్న నేపథ్యంలో పంత్‌కు చోటివ్వడం ఖాయం. జడేజాను నాలుగో స్థానంలో ఆడించి సక్సెస్ అయిన భారత్.. అదే ఫార్మూలాను కొనసాగిద్దామనుకున్నా.. అతను అందుబాటులో లేడు. లెఫ్టార్మ్ బ్యాటర్ అక్షర్ పటేల్‌ను టాపార్డర్‌లో ఆడించే సాహసం చేయకపోవచ్చు.

దినేశ్ కార్తీక్ ఔట్..

దినేశ్ కార్తీక్ ఔట్..

ఈ పరిస్థితుల్లోనే రిషభ్ పంత్‌కు చోటు ఖాయం. అయితే పంత్ జట్టులోకి వస్తే దినేశ్ కార్తీక్‌ చోటు గల్లంతవ్వనుంది. ఈ ఇద్దరిని ఆడించే పరిస్థితి జట్టులో లేదు. కాబట్టి కార్తీక్‌కు ఉద్వాసన తప్పేటట్టు లేదు. ఇక ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఆడటం ఖాయం. ఇక ఫస్ట్ డౌన్‌లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడు. నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో రిషభ్ పంత్ ఆడనుననాడు. ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నాడు.

బిష్ణోయ్‌కు చాన్స్..

బిష్ణోయ్‌కు చాన్స్..

హంగ్ కాంగ్‌తో తేలిపోయిన ఆవేశ్ ఖాన్ స్థానంలో రవి బిష్ణోయ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎక్స్‌ట్రా పేసర్‌కు బదులు టీమ్‌మేనేజ్‌మెంట్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ జట్టులోకి రానుండగా.. యుజ్వేంద్ర చాహల్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కొనసాగనున్నాడు. భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్‌, హార్దిక్ పాండ్యాతో కలిసి పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. ఇక ఆవేశ్ ఖాన్, బిష్ణోయ్‌లో ఒకరికి అవకాశం దక్కనుంది. దుబాయ్ పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తున్న నేపథ్యంలో బిష్ణోయ్ ఆడటం ఖాయమనిపిస్తోంది.

భారత్ తుది జట్టు(అంచనా)

భారత్ తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్/రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్

Story first published: Saturday, September 3, 2022, 16:11 [IST]
Other articles published on Sep 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+