For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI: భువీ ఔట్.. అశ్విన్ డౌట్.. శార్దూల్‌కు చాన్స్.. న్యూజిలాండ్ తో బరిలోకి దిగే భారత జట్టు ఇదే!

India playing 11 vs NZ T20 World Cup 2021: Hardik Pandya Doubt And Bhuvneshwar Kumar Out

India playing 11 for New Zealand t20 world cup match: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్ చేతిలో అనూహ్యంగా చిత్తయిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. న్యూజిలాండ్‌తో దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పనిసరిగా గెలవాలి. అయితే పాకిస్థాన్ చేతిలో ఓడిన న్యూజిలాండ్‌ది కూడా ఇదే పరిస్థితి. దాంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండటంతో ఈ మ్యాచ్‌ రసవత్తరంగా జరగనుంది. ఫస్ట్ మ్యాచ్ తప్పిదాలను సరిదిద్దుకునే పనిలో పడిన భారత్.. న్యూజిలాండ్ ఓడించాలనే లక్ష్యంతో నెట్స్‌లో శ్రమిస్తోంది. అయితే మెగా టోర్నీల్లో గత 18 ఏళ్లుగా న్యూజిలాండ్‌పై టీమిండియా గెలిచింది లేదు. 2003 వన్డే ప్రపంచకప్ తర్వాతి నుంచి మొన్నటి డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు అన్నింటిలోనూ భారత్ కంగుతిన్నది. దాంతో ఈ రికార్డును తిరగరాయాలనే పట్టుదలతో కోహ్లీసేన ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియాలో కొన్ని మార్పులు చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. మరీ ఈ మ్యాచ్ బరిలోకి దిగే భారత జట్టు కాంబినేషన్‌పై ఓ లుక్కేద్దాం.

 ఓపెనర్లుగా రాహుల్, రోహిత్..

ఓపెనర్లుగా రాహుల్, రోహిత్..

ఈ బిగ్ ఫైట్‌కు ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ బరిలోకి దిగడంలో ఎలాంటి సందేహం లేదు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఈ జోడీ దారుణంగా విఫలమైనా.. వీరే ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. వామప్ మ్యాచ్‌ల్లో ఇరగదీసిన ఈ జోడీ.. కీలక మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది. రోహిత్ శర్మ అయితే గోల్డెన్ డక్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో ఈ మ్యాచ్‌లోనైనా సత్తా చాటాలని ఈ ఇద్దరు భావిస్తున్నారు. భారత్ భారీ స్కోర్ చేయాలంటే ఈ ఇద్దరు మంచి శుభారంభం అందించడం చాలా కీలకం. న్యూజిలాండ్ పై ఈ ఇద్దరు మంచి శుభారంభం అందిస్తే భారత్‌కు తిరుగుండదు. ఇక ఫస్ట్ డౌన్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ రావడం ఖాయం. పాక్‌పై మ్యాచ్‌లో టాప్-3 విఫలమైనా కోహ్లీ సూపర్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. చూడ ముచ్చటైన షాట్లతో పాత కోహ్లీని తలపించాడు. అతను అదే జోరును కొనసాగిస్తే కివీస్‌కు కష్టాలు తప్పవు..

 హార్దిక్ పాండ్యా డౌట్..

హార్దిక్ పాండ్యా డౌట్..

ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బరిలోకి దిగడంపై అనుమానాలు నెలకొన్నాయి. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో దారుణంగా విఫమైన పాండ్యా.. భుజ గాయానికి గురయ్యాడు. దాంతో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో అతన్ని ఆడిస్తారా? లేక బెంచ్‌కే పరిమితం చేస్తారా? అనేది చూడాలి. అయితే బౌలింగ్ చేయని పాండ్యా జట్టులో ఉండటం ఎందుకని ఇప్పటికే అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అతన్ని పక్కనపెడితే మాత్రం ఇషాన్ కిషన్‌ను చోటు దక్కుతుంది. అప్పుడు పరిస్థితులను బట్టి అతన్ని బ్యాటింగ్‌కు పంపించవచ్చు. ఓపెనర్‌గా లేదా మిడిలార్డర్‌లో అవకాశం ఇవ్వచ్చు. ఇషాన్ కిషన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ మిడిలార్డర్ బాధ్యతలు మోయనున్నారు. సూర్య బాధ్యతాయుతంగా ఆడాల్సిన అవసరం ఉండగా.. పాక్‌తో పంత్ అద్భుతంగా రాణించాడు.

ఆల్‌రౌండర్లు జడేజా, శార్దూల్..

ఆల్‌రౌండర్లు జడేజా, శార్దూల్..

స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా జట్టులో ఉండటం ఖాయం. అయితే పాక్‌తో మ్యాచ్‌లో జడేజా దారుణంగా విఫలమయ్యాడు. అటు బ్యాటింగ్, ఇటు బ్యాటింగ్‌లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. కనీసం న్యూజిలాండ్‌తోనైనా అతను తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలి. లేదంటే టీమిండియాకు కష్టాలు తప్పవు. ఇక పాకిస్థాన్ చేతిలో దారుణంగా విఫలమైన భువనేశ్వర్ కుమార్ ప్లేస్‌లో శార్దూల్ ఠాకూర్‌ను తీసుకోవాలనే డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. దాంతో భువీ ప్లేస్‌లో శార్దూల్ బరిలోకి దిగనున్నాడు. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్దూల్.. కీలక సమయాల్లో వికెట్లు కూడా తీయగలడు. శార్దూల్ రాకతో లోయరార్డర్ బ్యాటింగ్ బలంగా మారనుంది. పైగా అతనికి మెంటార్ సింగ్ ధోనీ అండ ఉంది. ధోనీ వల్లే స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న అతను జట్టులోకి వచ్చాడు. పైగా ఐపీఎల్‌లో సత్తా చాటాడు. కాబట్టి తుది జట్టులో అతనికి చోటు ఖాయం.

పేస్ త్రయమే..

పేస్ త్రయమే..

మ్యాచ్ 7.30కు జరగనుంది కాబట్టి మంచు కీలక పాత్ర పోషించనుంది. ఈ నేపథ్యంలోనే భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రధాన పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలకు అవకాశం దక్కనుంది. అయితే పాక్‌తో మ్యాచ్‌లో భారత్ బౌలింగ్ విభాగం దారుణంగా విపలమైంది. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. దాంతో కీలక మ్యాచ్‌లో బుమ్రా, షమీలు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సిన అవసరం ఉంది. ఈ ఇద్దరు చెలరేగితే కివీస్‌కు కష్టాలు తప్పవు. ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ లేదా రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోవచ్చు. ఐపీఎల్‌లో దుమ్మురేపిన వరుణ్.. పాక్‌తో మ్యాచ్‌లో మాత్రం తడబడ్డాడు. ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఈ క్రమంలో అతని ప్లేస్‌లో అశ్విన్‌ను తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 న్యూజిలాండ్‌తో బరిలోకి దిగే భారత తుది జట్టు(అంచనా)

న్యూజిలాండ్‌తో బరిలోకి దిగే భారత తుది జట్టు(అంచనా)

కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా/ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ/రవిచంద్రన్ అశ్విన్

Story first published: Friday, October 29, 2021, 7:17 [IST]
Other articles published on Oct 29, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+