
ఓపెనర్లుగా మయాంక్, రాహుల్
రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో ఓపెనింగ్‌లో కేఎల్ రాహుల్‌కు జతగా మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇన్నాళ్లు ఓపెనర్‌గా సేవలందించిన శుభ్‌మన్ గిల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్‌లాంటి అటాకింగ్ బ్యాటర్లు అందుబాటులో లేకపోవడంతో గిల్‌తో మిడిలార్డర్‌ను మరింత స్ట్రాంగ్‌గా మార్చారని కొత్త కోచ్ ద్రవిడ్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక శుభ్‌మన్‌ను ఓపెనర్‌గా ఆడించి కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించే అవకాశం కూడా ఉంది. పైగా అతనికి మిడిలార్డర్‌లో ఆడిన అనుభవం ఉంది.

మిడిలార్డర్‌లో పుజారా, రహానే..
ఓపెనర్ల తర్వాత ఫస్ట్ డౌన్‌లో చతేశ్వర్ పుజారా ఆడనుండగా.. నాలుగో స్థానంలో అజింక్యా రహానే బ్యాటింగ్ చేయనున్నాడు. అయితే ఈ ఇద్దరి గత కొంతకాలంగా విఫలమవుతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలోనూ పెద్దగా రాణించలేదు. ఈ సిరీస్‌లోనైనా రాణించడం వీరికి కీలకం. లేకుంటే తుది జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉంది.
తొలిసారి టెస్ట్ టీమ్‌కు ఎంపిక చేసిన శ్రేయస్ అయ్యర్‌కు చోటివ్వాలంటే.. మాత్రం శుభ్‌మన్, మయాంక్‌లో ఒకరు బెంచ్‌కే పరిమితం కానున్నారు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అనుభవం లేని అయ్యర్‌కు ఫస్ట్ మ్యాచ్‌లోనే చోటు దక్కే అవకాశాలు అయితే కనిపించడం లేదు. వికెట్ కీపర్‌గా సీనియర్ ప్లేయర్ వృద్దీమాన్ సాహాను తీసుకుంటారా? లేదా తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్‌కు చోటు దక్కుతుందా? అనేది చూడాలి. యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇచ్చే ద్రవిడ్.. భరత్‌కే చోటిచ్చే చాన్స్ ఉంది.

ముగ్గురు ఆల్‌రౌండర్లు..
ఇక జట్టులో ముగ్గురు స్పిన్ ఆల్‌రౌండర్లను తీసుకునే చాన్సుంది. కాన్నూర్ వికెట్‌పై టర్న్ లభిస్తుంది కాబట్టి భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ ముగ్గురు తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ దుమ్మురేపారు. జడేజా రెస్ట్‌ను ముగించుకొని ఫ్రెష్‌గా వస్తున్నాడు. భారత గడ్డపై అశ్విన్-జడేజా ఎంత ప్రమాదకర ఆటగాళ్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్షర్ సైతం సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో దుమ్మురేపాడు.

సిరాజ్/ఉమేశ్ యాదవ్..
ఇక ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే ఇద్దరు పేసర్లు మాత్రమే జట్టులో ఉండనున్నారు. టీ20 సిరీస్‌లో గాయపడిన సిరాజ్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. భవిష్యత్తు టోర్నీల దృష్ట్యా అతన్ని ఆడించి రిస్క్ చేయకపోవచ్చు. అదే జరిగితే సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ బరిలోకి దిగడం ఖాయం. అయితే గత కొంత కాలంగా ఉమేశ్ పెద్దగా టచ్‌లో లేడు. అతనికి జోడిగా ఇషాంత్ శర్మ బరిలోకి దిగే అవకాశం ఉంది. సిరాజ్ ఫిట్‌గా ఉంటే మాత్రం అతను తుది జట్టులో ఉండటం పక్కా. అప్పుడు ఉమేశ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.

తుది జట్టు (అంచనా)
కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా(వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అజింక్యా రహానే, వృద్దిమాన్ సాహా/శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్/ మహమ్మద్ సిరాజ్


Click it and Unblock the Notifications












