
రహానేపై వేటు పడెనా?
ఇక మెల్ బోర్న్ టెస్ట్ సెంచరీ తర్వాత రహానే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి ఆడలేదు. . సిడ్నీ టెస్ట్, బ్రిస్బేన్ టెస్ట్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. అయితే ఆ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకోవడంతో రహానే వైఫల్యం పెద్దగా చర్చనీయాంశం కాలేదు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 49 పరుగులతో పర్వాలేదనిపించినా.. రెండో ఇన్నింగ్స్‌లో 19 రన్స్‌కే ఔటయ్యాడు. అనంతరం ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో 5, 1, 61, 18, 10, 14, 0 దారుణంగా విఫలమయ్యాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లోనూ 35, 4 మెప్పించలేకపోయాడు. మరోవైపు కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్.. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ, హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దాంతో కోహ్లీ కోసం ఎవరిని పక్కనపెట్టాలనేది టీమిండియా మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది.

మయాంక్ అగర్వాల్‌పై వేటు..
వరుసగా విఫలమవుతున్న అజింక్యా రహానేనే పక్కన పెట్టే అవకాశం ఉంది. మంచి ప్రదర్శన కనబర్చిన శ్రేయస్ అయ్యర్‌పై వేటు వేస్తే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతాయి. కాబట్టి రహానేనే పక్కనపెట్టేందుకు టీమ్‌మేనేజ్‌మెంట్ సాహిసించవచ్చు. ఒక వేళ అతనికి మరో అవకాశం ఇవ్వాలని భావిస్తే మాత్రం ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌పై వేటు పడే చాన్సుంది.
అప్పుడు కోహ్లీ లేదా పుజారా.. శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉంటుంది. మయాంక్ అగర్వాల్ సైతం ఫస్ట్ టెస్ట్‌లో దారుణంగా విఫలమయ్యాడు. రోహిత్ శర్మ రెగ్యూలర్ ఓపెనర్‌గా మారడంతో మయాంక్ చాలా రోజుల నుంచి బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ సిరీస్‌లో వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు.

మిడిలార్డర్‌లో..
మయాంక్‌కు అవకాశమిస్తే మాత్రం రహానేపైనే వేటు పడుతుంది. అప్పుడు పుజారా, కోహ్లీ మిడిల్ ఆర్డర్‌లో ఆడనున్నారు. ఇక ఫస్ట్ టెస్ట్‌లో మెడనొప్పికి గురైన వృద్దిమాన్ సాహాపై కూడా వేటు పడే చాన్సుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో విలువైన పరుగులు చేసిన సాహా.. కీపింగ్ మాత్రం చేయలేకపోయాడు.
మరోవైపు అతని స్థానంలో కీపింగ్ చేసిన యువ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ దుమ్మురేపాడు. సూపర్ కీపింగ్‌తో ఆకట్టుకొని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. సాహా ఫిట్‌గా లేకుంటే శ్రీకర్ భరత్ అరంగేట్రం చేయడం ఖాయం. అదే జరిగితే అతను ఐదో స్థానంలో బ్యాటింగ్ వస్తాడు.

సిరాజ్ కమ్ బ్యాక్..
ఇక స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ మరోసారి కీలకం కానున్నారు. ఫస్ట్ మ్యాచ్‌లో ఆకట్టుకున్న ఈ ఆల్‌రౌండ్ త్రయం.. సెకండ్ టెస్ట్‌లో కూడా చెలరేగితే భారత్‌కు తిరుగుండదు. మైదానంలో పరిస్థితులను బట్టి జడేజా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయవచ్చు. లోయరార్డర్‌లో అశ్విన్, అక్షర్ పటేల్ కీలకం కానున్నారు.
ఇక రెండో టీ20లో చేతి వేలి గాయానికి గురైన మహమ్మద్ సిరాజ్ జట్టులోకి రావచ్చు. అదే జరిగితే ఇషాంత్ శర్మపై వేటు పడుతుంది. ఫస్ట్ టెస్ట్‌లో ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ పెద్దగా రాణించలేదు. ఉమేశ్ రెండు వికెట్లు తీసినా.. ఇషాంత్ శర్మ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

భారత తుది జట్టు(అంచనా)
శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్/అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్/వృద్దిమాన్ సాహా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ సిరాజ్


Click it and Unblock the Notifications












