
వరుణ్ ఔట్.. రాహుల్ చాహర్ ఇన్..
ఇప్పటి వరకు వరుసగా అవకాశాలందుకున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీకి ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కకపోవచ్చు. అతని స్థానంలో రాహుల్ చాహర్‌ను ఆడించే చాన్సుంది. ఇప్పటి వరకు రాహుల్ చాహర్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే అశ్విన్‌తో పాటు రాహుల్ చాహర్ ఆడే అవకాశం ఉంది. లేదంటే శార్దూల్ ఠాకూర్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వవచ్చు. మిస్టరీ స్పిన్నర్‌గా జట్టులోకి దూసుకొచ్చిన వరుణ్ చక్రవర్తీ.. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. మూడు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పాకిస్థాన్, న్యూజిలాండ్‌పై దారుణంగా విఫలమయ్యాడు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌ను పక్కనపెట్టి వరుణ్‌ను ఆడించిన టీమ్‌మేనేజ్‌మెంట్ మూల్యం చెల్లించుకుంది.

షమీకి రెస్ట్..
ఇక సీనియర్ పేసర్లు అయిన మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రాల్లో ఒకరికి విశ్రాంతినివ్వవచ్చు. ఈ టోర్నీలో బుమ్రా పర్వాలేదనిపించినా.. షమీ గత మ్యాచ్‌తో టచ్‌లోకి వచ్చాడు. పాక్‌తో మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన భువనేశ్వర్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం ఇవ్వవచ్చు. లేదంటే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే శార్దూల్‌ను తీసుకురావచ్చు. షమీ, బుమ్రాల్లో ఒకరు మాత్రం ఆడటం ఖాయం. స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా జట్టులో ఉంటారు.

ఓపెనర్లుగా రాహుల్, రోహిత్..
ఇక బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బరిలోకి దిగడం ఖాయం. ప్రస్తుతం ఈ ఇద్దరు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇతర బ్యాట్స్‌మన్‌కు అవకాశం ఇవ్వకుండా పరుగులు చేస్తున్నారు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్‌లో విరాట్ కోహ్లీ ఆడనున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విరాట్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. అనంతరం సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగుతాడు. ఆ తర్వాత హార్డ్ హిట్టర్స్ రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేయనున్నారు.

భారత తుది జట్టు(అంచనా):
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్/భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ/రాహుల్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా


Click it and Unblock the Notifications












