Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing 11: కేఎల్ రాహుల్ ఔట్.. రోహిత్ ఇన్.. ! ఆస్ట్రేలియాతో వామప్ మ్యాచ్ బరిలోకి దిగే భారత జట్టు ఇదే!

India Playing 11 vs Australia T20 World Cup 2nd Practice Match: Rohit Sharma In And KL Rahul Out

హైదరాబాద్: టీమిండియా టీ20 ప్రపంచకప్‌ ప్రయాణం ఘనంగా మొదలైంది. మెగా టోర్నీకి ముందు సన్నాహకంగా ఇంగ్లండ్‌తో సోమవారం జరిగిన వామప్ మ్యాచ్‌లో కోహ్లీసేన 7 వికెట్లతో గెలుపొందింది. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (46 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70 రిటైర్డ్ ఔట్), కేఎల్ రాహుల్(24 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51) అర్థశతకాలతో పరుగుల విధ్వంసం సృష్టించారు. దాంతో ఇంగ్లండ్‌పై భారత్ సునాయస విజయాన్నందుకుంది. ఇప్పుడు మరో రసవత్తరపోరకు సిద్దమవుతోంది.

ఆస్ట్రేలియాతో బుధవారం జరగనున్న వామప్ మ్యాచ్‌తో టీమ్ కాంబినేషన్‌పై ఓ క్లారిటీకి రావాలని భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో ప్రధాన ఆటగాళ్లందరికి అవకాశం ఇచ్చిన టీమ్ మేనేజ్‌మెంట్ రెండో మ్యాచ్‌లో మిగతా ఆటగాళ్లను పరీక్షించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే తొలి వామప్ మ్యాచ్‌కు దూరంగా ఉన్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మతో పాటు శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తీకి అవకాశం దక్కనుంది.

రాహుల్ ఔట్.. రోహిత్ ఇన్..

రాహుల్ ఔట్.. రోహిత్ ఇన్..

ఓపెనర్‌గా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌ ఇద్దరూ సత్తా చాటారు. దాంతో ఆసీస్‌తో జరిగే రెండో వామప్ మ్యాచ్‌లో ఈ ఇద్దరిలో ఒకరు బెంచ్‌కే పరిమితం కానున్నారు. సీనియర్ ప్లేయర్‌ అయిన కేఎల్ రాహుల్‌నే పక్కనపెట్టే అవకాశాలున్నాయి. అతని స్థానంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను బరిలోకి దింపనున్నారు. అయితే ఈ టోర్నీలో రోహిత్ శర్మతో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా వస్తాడని, తాను మూడో నెంబర్‌లో ఆడుతానని సోమవారం టాస్ సందర్భంగా విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్‌కు ప్రాక్టీస్ కావాలని టీమ్‌మేనేజ్‌మెంట్ కోరుకుంటే ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితమవుతాడు.

మిడిలార్డ్‌లో మార్పుల్లేవ్..

మిడిలార్డ్‌లో మార్పుల్లేవ్..

ఇక ఫస్ట్ డౌన్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ రానున్నాడు. ఇంగ్లండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో విఫలమైన కోహ్లీ.. మెగా టోర్నీ ముందు రిథమ్ అందుకోవాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనికి మరో అవకాశం దక్కనుంది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ రానున్నారు. ఇంగ్లండ్‌తో సూర్యకుమార్ విఫలమైనప్పటికీ.. రిషభ్ పంత్ అద్భుతంగా ఆడాడు. మూడు భారీ సిక్సర్లతో కనువిందు చేశాడు. మొయిన్ అలీ బౌలింగ్‌లో ఒంటి చేత్తో కొట్టిన సిక్స్ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. కీపర్‌గా మరింత ప్రాక్టీస్ లభించేందుకు అతనికి మరో అవకాశం దక్కనుంది.

హార్దిక్ డౌట్..

హార్దిక్ డౌట్..

హార్దిక్ పాండ్యాకు మరో అవకాశం ఇస్తారా? లేదా? అనేది చూడాలి. కేవలం బ్యాట్స్‌మన్‌గానే కొనసాగుతున్న హార్దిక్.. ఇంగ్లండ్‌తో వామప్ మ్యాచ్‌లో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. అయితే బౌలింగ్ మాత్రం చేయలేదు. అతను కేవలం ఫినిషర్ పాత్రలోనే జట్టులో కొనసాగే అవకాశం ఉంది. ఇక ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, రాహుల్ చాహర్‌లకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది.

ఈ ముగ్గురి ప్లేస్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తీ, శార్దూల్ ఠాకూర్ ఆడే అవకాశం ఉంది. ఒక వేళ మహ్మద్ షమీకి విశ్రాంతినిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయిన భువీకి మరో అవకాశం ఇవ్వనున్నారు.

భారత్ తుది జట్టు(అంచనా)..

భారత్ తుది జట్టు(అంచనా)..

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్/ ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ/జస్‌ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, రాహుల్ చాహర్/ వరుణ్ చక్రవర్తీ

Story first published: Tuesday, October 19, 2021, 14:27 [IST]
Other articles published on Oct 19, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+