For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2021: ఆ ఇద్దరిని తీసేస్తే టీమిండియా దరిద్రం పోతుంది.. లేకుంటే ఓటములే వెక్కిరిస్తాయ్!

India Playing 11 For T20 World Cup 2021: Hardik Pandya & Bhuvneshwar Kumar Should Be Removed From Team

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ఊహించని పరాజయం ఎదురైంది. కలలో కూడా అనుకోని ఫలితం వెక్కిరించింది. తొలి మ్యాచే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో.. గత రికార్డు నేపథ్యంలో దాయాదిపై తిరుగుండదు.. భారీ విజయంతో టీమిండియా టోర్నీని ప్రారంభించడం ఖాయమేనంటూ ఏర్పడ్డ అంచనాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. గెలవాలన్న కసి.. పక్కా ప్రణాళికతో మైదానంలో అడుగుపెట్టిన పాక్.. భారత్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది. టీ20, వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి తన చేతిలో టీమిండియాకు ఓటమి రుచి చూపించింది. ఈ ఓటమి దేశవ్యాప్తంగా అభిమానుల ఆవేదనను మిగల్చడమే కాకుండా.. ఇప్పుడీ టోర్నీలో భారత ప్రయాణాన్ని కఠినంగా మార్చింది. టోర్నీలో ముందుకు సాగాలంటే ప్రతీ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాక్‌తో ఓటమి బాధను పక్కకుపెట్టి.. వైఫల్యాలపై దృష్టి సారించి.. ఇప్పటికైనా మేల్కొని రాబోయే మ్యాచ్‌ల్లో జట్టు సత్తాచాటాలి. లేదంటే మరోసారి టీ20 ప్రపంచకప్ అందని ద్రాక్షే అవుతుంది.

 టీమ్ కాంబినేషన్ సెట్ చేయాలి..

టీమ్ కాంబినేషన్ సెట్ చేయాలి..

మెగాటోర్నీలో భారత్ విజయాల బాట పట్టాలంటే ముందుగా టీమ్ కాంబినేషన్‌ను మార్చాలి. ఫస్ట్ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయిన భువనేశ్వకుమార్‌తో పాటు బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండా జట్టుకు భారమైన హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టాలి. భువనేశ్వర్ స్థానంలో బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్డూల్ ఠాకూర్‌కు అవకాశం కల్పించాలి. స్లో బౌలర్ అయినటువంటి శార్దూల్.. కీలక సమయంలో వికెట్లు తీయడంలో దిట్ట. లోయరార్డ్‌లో ప్రధాన బ్యాట్స్‌మన్‌లా భారీ షాట్లు ఆడగలడు. పైగా అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే పాక్‌తో మ్యాచ్‌లో శార్దూల్ ఉంటే భారత్ కనీసం పోటీ అయిన ఇచ్చేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో అతను సత్తా చాటాడు. జట్టు చాంపియన్‌గా నిలవడంలో అతని పాత్ర చాలా కీలకం. కాబట్టి అతన్ని తుది జట్టులోకి తీసుకోవాలి.

హార్దిక్ ఎందుకు దండుగ..

హార్దిక్ ఎందుకు దండుగ..

బౌలింగ్ చేయలేని హార్దిక్ పాండ్యా జట్టుకు భారమయ్యాడు. కేవలం బ్యాట్స్‌మన్‌గానే అతన్ని జట్టులో కొనసాగిస్తున్నా.. హిట్టర్‌గా తన పాత్రకు న్యాయం చేయలేకపోతున్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డ హార్దిక్.. ఫీల్డింగ్ కూడా చేయలేదు. ఫిట్‌గా లేని, బౌలింగ్, బ్యాటింగ్ చేయని పాండ్యా అవసరమా.? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే గాయం నేపథ్యంలో అతను తదుపరి మ్యాచ్ ఆడటం కష్టమే. హార్దిక్ పాండ్యా స్థానంలో ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోవాలి. అప్పుడు ఆరంభంలోనే వికెట్ పడితే ఇషాన్‌ను ఫస్ట్ డౌన్‌లో పంపించవచ్చు. లేదంటే పరిస్థితులను చూసుకుంటూ మిడిలార్డర్‌లో ఆడించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తొ లి మ్యాచ్‌లో పాక్‌పై భారత్‌ గెలిస్తే.. టోర్నీలో ఆ జోష్‌ వేరుగా ఉండేది. ఆ విజయం కచ్చితంగా జట్టుకు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేది. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న మ్యాచ్‌లో ఓటమి పలకరించడంతో జట్టు పరిస్థితి ఇబ్బందిగా మారింది. అనూహ్య పరాజయంతో టోర్నీని ఆరంభించిన కోహ్లీసేనకు.. ఇక ప్రతి మ్యాచ్‌ కీలకమే.

ముందుకు సాగాలంటే గెలవాలి..

ముందుకు సాగాలంటే గెలవాలి..

గ్రూప్‌- 2లో భారత్‌తో పాటు పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌, నమీబియా, స్కాట్లాండ్‌ ఉన్నాయి. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌ చేరతాయి. తొలి మ్యాచ్‌లో పాక్‌ చేతిలో ఓడిన భారత్‌.. ఇప్పుడు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ గ్రూపులో అఫ్గానిస్థాన్‌, నమీబియా, స్కాట్లాండ్‌ రూపంలో మూడు బలహీనమైన జట్లే ఉన్నాయి. సంచలనాలు ఏమైనా జరిగితే తప్ప వీటిపై విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. న్యూజిలాండ్‌పై భారత్‌ గెలిచి.. ఆ తర్వాత ఈ మూడు జట్లపై నెగ్గితే 8 పాయింట్లు వస్తాయి. ఒకవేళ న్యూజిలాండ్‌ చేతిలో ఓడితే మాత్రం.. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా ఆరు పాయింట్లే దక్కుతాయి.

నాలుగు గెలవాల్సిందే..

నాలుగు గెలవాల్సిందే..

అప్పుడు తొలి రెండు స్థానాల్లో నిలవడం కష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే భారత్‌పై గెలిచిన పాకిస్థాన్.. ఒకవేళ కివీస్‌తో ఓడినా..ఆ మూడు చిన్న జట్లపై విజయాలు సాధించి 8 పాయింట్లు దక్కించుకునే అవకాశం ఉంది. భారత్‌పై కివీస్‌ గెలిస్తే.. పాక్‌తో పరాజయం పాలైనా.. మిగతా మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి 8 పాయింట్లు సాధించే ఆస్కారం ఉంది. అప్పుడు పాక్‌, కివీస్‌ చెరో 8 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలవగా.. భారత్‌ మాత్రం 6 పాయింట్లతో సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి భారత్ జాగ్రత్తగా ఆడాలి. అయితే న్యూజిలాండ్‌తో విజయం సాధిస్తే.. చిన్న జట్లతో పరిస్థితులను చూసుకుంటూ టీమిండియా ఆడవచ్చు.

Story first published: Tuesday, October 26, 2021, 23:21 [IST]
Other articles published on Oct 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+