For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing 11 For Souh Africa: వామికా బర్త్‌డే సెలెబ్రేషన్స్ కోసం వన్డే సిరీస్‌కు కోహ్లీ దూరం!

India Playing 11 For South Africa Series: Virat Kohli Out ODI Matches Due TO Vamika Birthday

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే సౌతాఫ్రికా పర్యటన కోసం భారత సెలెక్షన్ కమిటీ ఇటీవల 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇక అప్పటి నుంచి రోజుకో వార్త అభిమానులను కలవరపాటు గురి చేస్తూనే ఉంది. టీమ్ ప్రకటించిన వెంటనే.. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని తప్పిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. టీ20 సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మనే వన్డే టీమ్‌ను కూడా నడిపిస్తాడని స్పష్టం చేసింది.

కోహ్లీ ఫోన్ స్విచ్చాఫ్..

కోహ్లీ ఫోన్ స్విచ్చాఫ్..

ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగగా.. యావత్ క్రికెట్ ప్రపంచం రెండుగా చీలిపోయింది. కొందరూ బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబడితే.. మరికొందరూ సమర్థించారు. ఇక విరాట్ కోహ్లీ అయితే ఇప్పటి వరకు కనీసం నోరు కూడా మెదపలేదు. అతని ఫోన్ ఇప్పటికీ స్విచ్చాఫ్‌లోనే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అతని చిన్ననాటి కోచే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ బీసీసీఐ తీరును తప్పుబట్టాడు. అనంతరం సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందు ముంబై వేదికగా ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్‌కూ కోహ్లీ డుమ్మా కొట్టాడు. టీమ్ క్వారంటైన్ ప్రారంభమైనా.. ఇప్పటికీ కోహ్లీ జట్టుతో కలవలేదు. సెలెక్టర్లు, బీసీసీఐ పెద్దలు కోహ్లీకి ఫోన్ చేసినా అతను రెస్పాండ్ అవ్వలేదని ప్రచారం జరుగుతోంది.

రోహిత్ శర్మ గాయం..

రోహిత్ శర్మ గాయం..

ఆ వెంటనే వన్డే కెప్టెన్‌గా, టెస్ట్ వైస్ కెప్టెన్‌గా డబుల్ ప్రమోషన్ అందుకున్న రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడి టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. టీమిండియా త్రో డౌన్స్ స్పెషలిస్ట్ రఘు విసిరిన బంతి రోహిత్ చేతికి బలంగా తాకిందని, అతను సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉందని ఉదయమే వార్తలు షికారు చేశాయి. ఇక సాయంత్రానికి రోహిత్ గాయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. అయితే చేతి గాయం పెద్దదేమి కాదని, తొడకండరాలు పట్టేయడంతోనే అతను మూడు టెస్ట్‌ల సిరీస్‌కు దూరమయ్యాడని ట్వీట్ చేసింది.

వన్డే సిరీస్‌కు విరాట్ దూరం..

వన్డే సిరీస్‌కు విరాట్ దూరం..

ఇక తాజాగా సౌతాఫ్రికా పర్యటనలోని మూడు వన్డేల సిరీస్‌కు టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కూతురు వామికా బర్త్‌డే సెలెబ్రేషన్స్‌లో పాల్గొనేందుకే విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడని, ఇప్పటికే బీసీసీఐ పెద్దలకు సమాచారమిచ్చాడని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ ఏడాది జనవరి 11న వామికా పుట్టిన విషయం తెలిసిందే. వామికా తొలి బర్త్‌డే నేపథ్యంలో ఫ్యామిలీతో కలిసి విరాట్ హాలిడే ట్రిప్ వెళ్లాలని ప్లాన్ చేసాడట. అయితే మూడు టెస్ట్‌ల సిరీస్ ముగిసిన తర్వాతే ఈ ట్రిప్ ఉంటుందని, దాంతోనే వన్డే సిరీస్ ఆడలేనని కోహ్లీ తెలిపినట్లు సమాచారం. ఇక మూడు టెస్ట్‌ల సిరీస్‌లో చివరి టెస్ట్ జనవరి 11 నుంచి 15వరకు జరగనుంది. వామికా బర్త్‌డే రోజునే చివరి టెస్ట్ ప్రారంభం కానుంది. కానీ టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాతే సెలెబ్రేషన్స్ పెట్టుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

కోహ్లీ కావాలనే

కోహ్లీ కావాలనే

ఉద్దేశపూర్వకంగానే విరాట్ వన్డే సిరీస్ నుంచి దూరమవ్వాలనకుంటున్నాడని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక కోహ్లీ రిక్వెస్ట్‌కు బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వన్డే సిరీస్ వరకు రోహిత్ ఫిట్ అవుతాడని బీసీసీఐ భావిస్తోంది. ఆ క్రమంలోనే కోహ్లీ రిక్వెస్ట్‌కు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రోహిత్ ఇంజ్యూరీ పెద్దదై కోలుకోకుంటే మాత్రం.. కోహ్లీని వన్డే సిరీస్ ఆడమని బీసీసీఐ కోరే అవకాశం ఉంది. ఇక రోహిత్ శర్మ గైర్హాజరీలో టెస్ట్ వైస్ కెప్టెన్ ఎవరా? అనేదానిపై ఆసక్తి నెలకొంది. పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్‌కే ఈ అవకాశం దక్కనుంది.

భారత తుది జట్టు(వన్డే సిరీస్)

రోహిత్ శర్మ(కెప్టెన్), కేల్ రాహుల్(వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్/చాహల్

Story first published: Tuesday, December 14, 2021, 11:00 [IST]
Other articles published on Dec 14, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+