India Playing 11 vs Sri Lanka: ఓపెనర్‌గా పృథ్వీ షా! రాజస్థాన్ యువ పేసర్ అరంగేట్రం! తుది జట్టు ఇదే!

హైదరాబాద్: విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత ప్రధాన టెస్టు జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్‌లో ఉన్న విషయం తెలిసిందే. అందుకే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత యువ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. దేశవాళీ, ఐపీఎల్ టోర్నీలో సత్తాచాటిన యువ ఆటగాళ్లు లంక పర్యటనలో ఉన్నారు. జులై 18 నుంచి శ్రీలంక-భారత్ పర్యటన ఆరంభం కానుంది.
ఆదివారం మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం కానుంది. అయితే జట్టులో కుర్రాళ్లు ఉండడంతో పోటీ పతాక స్థాయిలో ఉంది. దీంతో లంకతో ఆడబోయే భారత తుది జట్టుపై ఆసక్తి నెలకొంది. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరెవరు ఉంటారో ఓసారి చూద్దాం.

ఓపెనర్‌గా పృథ్వీ షా
కెప్టెన్, సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌తో పాటు యువ ఆటగాడు పృథ్వీ షా తొలి వన్డేలో ఓపెనింగ్ చేయనున్నాడు. ఇటీవలి కాలంలో దేశవాళీ క్రికెట్లో షా పరుగుల వరద పారించాడు. భారీ సెంచరీలతో ఏకంగా 800లకు పైగా పరుగులు నమోదు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో కూడా అదరగొట్టాడు.
ఓ మ్యాచులో ఏకంగా ఓవర్లోని ఆరు బంతులను బౌండరీలు మలిచాడు. ఓపెనింగ్ భాగస్వాములుగా ధావన్, షాకు మంచి అనుబంధం ఉంది. షా ఓపెనర్‌గా రానున్న నేపథ్యంలో భారత జట్టులోకి మొదటిసారి ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్‌లకు నిరాశే ఎదురుకానుంది. ఈ ఇద్దరికీ తుది జట్టులో స్థానం దక్కేందుకు మరికొంత సమయం పట్టేలా ఉంది.

శాంసన్ లేదా ఇషాన్
సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో నితీశ్ రాణాకు చోటు దక్కకపోవచ్చు. మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యాలు మిడిల్ ఆర్డర్‌లో రావడం ఖాయం. ఈ ఇద్దరిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్ 2021లో పాండే నెమ్మదిగా ఆడినా.. హాఫ్ సెంచరీలతో అడగొట్టాడు. హార్దిక్ మెరుపులను చూశాం. ఇక వికెట్ కీపర్ రేసులో ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ఉన్నారు.
సంజుకు సరైన అవకాశాలు ఇవ్వలేదన్న అపవాదు బీసీసీఐపై ఎప్పటినుంచో ఉంది. దీంతో అతడు తుది జట్టులో ఆడడం దాదాపు ఖాయమే. ఐపీఎల్ 2021లో రాణించడం కూడా అతడికి కలిసొచ్చేదే. పరుగుల వరద పారిస్తున్న కిషన్ కూడా జట్టులోకి వచ్చినా.. పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు.

సకారియా అరంగేట్రం:
ఉపఖండ పిచ్‌లు కాబట్టి తుది జట్టులో కచ్చితంగా ఇద్దరు స్పిన్నర్లు ఉంటారు. యుజ్వేంద్ర చహల్ తోడుగా కృనాల్ పాండ్యాను తీసుకుంటే బ్యాటింగ్‌లో కూడా పనికొస్తాడు. కృనాల్ మంచి ఆల్‌రౌండర్ అన్న విషయం తెలిసిందే. దీంతో ఎప్పటినుంచో జట్టులో చోటు ఆశిస్తున్న కుల్దీప్ యాదవ్‌కు నిరాశే ఎదురుకానుంది. పేస్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్ ఖాయం కాగా.. రాజస్థాన్ రాయల్స్ యువ ప్లేయర్ చేతన్ సకారియా భారత జట్టులోకి అరంగేట్రం చేయొచ్చు. ఐపీఎల్ 2020, 21లో సకారియా బాగా ఆడాడు. అయితే రెండో స్పెసలిస్ట్ స్పిన్నర్ అవసరం అనుకుంటే సకారియా బదులు కుల్దీప్ చోటు దక్కించుకోవచ్చు.

భారత తుది జట్టు ఇదే (అంచనా):
శిఖర్ ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, యుజ్వేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), దీపక్ చహర్, చేతన్ సకారియా.

డ్రీం ఎలెవన్ టీమ్:
శిఖర్ ధావన్ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, దాసున్ షనక, అవిష్కా ఫెర్నాండో, ధనంజయ డి సిల్వా, హార్దిక్ పాండ్యా, వనిండు హసరంగ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, దుష్మంత చమీరా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
WI vs AUS 5th T20I: లూయిస్ సిక్సుల వర్షం, చెలరేగిన కాట్రెల్.. విండీస్ చేతిలో మరోసారి చిత్తయిన ఆస్ట్రేలియా!