Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Palying XI: ఆ స్టార్‌ ఆల్‌రౌండర్‌పై వేటు.. అమెరికాతో తలపడే భారత తుది జట్టు ఇదే!

టీ20 ప్రపంచకప్ 2024లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. గ్రూప్-ఏలో భాగంగా బుధవారం న్యూయార్క్‌లోని నాసౌ కౌంటీ స్టేడియం వేదికగా ఆతిథ్య అమెరికా (USA)తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.

ఐర్లాండ్, పాకిస్థాన్‌పై విజయం సాధించిన టీమిండియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా.. యూఎస్‌ఏ కూడా పాకిస్థాన్, కెనడాను ఓడించి మరో సంచలన విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది.

India Palying XI vs USA for T20 World Cup 2024 Shivam Dube Out and Yashasvi Jaiswal In

శివమ్ దూబేపై వేటు..
ఈ మ్యాచ్ గెలిచిన జట్టు గ్రూప్-ఏ నుంచి అధికారికంగా సూపర్-8కు అర్హత సాధించనుంది. వర్షం కారణంగా రద్దయితే మాత్రం పాకిస్థాన్ సూపర్ 8 చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒకే కాంబినేషన్‌తో బరిలోకి దిగిన టీమిండియా.. అమెరికాతో పోరులో తుది జట్టులో ఒక మార్పు చేసే అవకాశం ఉంది. స్పెషలిస్ట్ బ్యాటర్‌గా సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌లో ఒకరికి అవకాశం ఇవ్వనుంది. దాని కోసం పాకిస్థాన్‌తో దారుణంగా విఫలమైన శివమ్ దూబేపై వేటు వేయనుంది.

జైస్వాల్‌కు చోటు..
అతను రెండు మ్యాచ్‌ల్లో అటు బ్యాట్, ఇటు బంతితో రాణించిందేం లేదు. శివమ్ దూబేతో రోహిత్ ఒక్క ఓవర్ కూడా వేయించలేదు. ఈ క్రమంలోనే అతన్ని పక్కనపెట్టి స్పెషలిస్ట్ బ్యాటర్లు అయిన యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్‌ల్లో ఒకరిని తుది జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. యశస్వి జైస్వాల్‌ ఆడేందుకే ఎక్కువ అవకాశం ఉంది.

ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ 1, 4 దారుణంగా విఫలమవడంతో అతన్ని ఫస్ట్ డౌన్‌లో ఆడించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ క్రమంలోనే యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా ఆడించిన విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయించాలనుకుంటోంది. పవర్ ప్లేలో దూకుడుగా ఆడే సామర్థ్యం యశస్వి జైస్వాల్‌కు ఉంది.

పేస్ త్రయం జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ అదరగొడుతుండగా..ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌లు దుమ్మురేపుతున్నారు. కానీ మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటి వరకు వికెట్ల ఖాతా తెరవలేదు. అయితే అతని స్థానానికి ఇప్పుడే వచ్చిన ముప్పు ఏం లేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్‌లకు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది.

భారత తుది జట్టు(అంచనా) Vs అమెరికా:

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్

Story first published: Monday, June 10, 2024, 18:23 [IST]
Other articles published on Jun 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+