Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: ఆ ఇద్దరిపై వేటు.. మ్యాచ్ విన్నర్ రీఎంట్రీ! సూపర్ 8లో ఆడే భారత తుది జట్టు ఇదే!

టీ20 ప్రపంచకప్ 2024లో హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కు అర్హత సాధించిన టీమిండియా.. తొలి మ్యాచ్‌ను అప్గానిస్థాన్‌తో ఆడనుంది. జూన్ 20న బార్బోడస్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికాను ఓడించిన టీమిండియా గ్రూప్-ఏ టాపర్‌గా సూపర్-8లోకి అడుగుపెట్టింది.

కెనడాతో జరగాల్సిన ఆఖరి మ్యాచ్‌లో వర్షం కారణంగా రద్దయ్యింది. సూపర్-8లో టీమిండియా.. ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌తో పాటు బంగ్లాదేశ్/నెదర్లాండ్స్‌తో తలపడనుంది. జూన్ 20న బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో అఫ్గానిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. లీగ్ దశలో న్యూయార్క్‌లో తాత్కలికంగా నిర్మించిన నాసౌ కౌంటీ క్రికెట్ స్టేడియంలోని డ్రాప్ ఇన్ పిచ్‌లపై టీమిండియా మూడు మ్యాచ్‌లు ఆడింది.

India Palying XI for Super 8 Match vs Afghanistan Yashasvi Jaiswal In and 2 Players out

నాలుగు మార్పులతో టీమిండియా..
బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై కష్టంగా విజయాలు అందుకుంది. అయితే సూపర్ 8 మ్యాచ్‌లు వెస్టిండీస్ వేదికగా ఆడనుంది. అక్కడి పిచ్‌లపై స్పిన్నర్ల ఆధిపత్యం కొనసాగనుంది. ఈ క్రమంలోనే టీమిండియా తమ కాంబినేషన్‌లో నాలుగు మార్పులు చేసే అవకాశం ఉంది.

స్పిన్నర్లు రాజ్యమేలే బార్బోడస్ మైదానంలో తమ స్పిన్ అస్త్రం కుల్దీప్ యాదవ్‌ను బరిలోకి దించనుంది. అతను అర్ష్‌దీప్ సింగ్ లేదా మహమ్మద్ సిరాజ్ స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది.

కోహ్లీకి డిమోషన్..
అలాగే ఓపెనర్‌గా ఆడిన విరాట్ కోహ్లీని మూడో స్థానంలోకి డిమోట్ చేయనుంది. ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌ను బరిలోకి దించనుంది. రోహిత్ శర్మతో కలిసి అతను ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. జైస్వాల్ కోసం రవీంద్ర జడేజా లేదా అక్షర్ పటేల్‌లో ఒకరు వేటుకు గురికానున్నారు.

ఫామ్‌లో లేని జడేజానే పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత మూడు మ్యాచ్‌ల్లో అతను ఒక్క వికెట్ కూడా తీయలేదు. బ్యాటింగ్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు.

శివమ్ దూబే‌కు ఛాన్స్..
శివమ్ దూబే మాత్రం తుది జట్టులో కొనసాగనున్నాడు. స్పిన్ బౌలింగ్‌ను అతను సమర్థవంతంగా ఆడగలడు. మిడిల్ ఓవర్లలో అఫ్గాన్ స్పిన్నర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించేందుకు శివమ్ దూబేను జట్టులో కొనసాగించనున్నారు. అమెరికాతో మ్యాచ్‌లో అతను కీలక ఇన్నింగ్స్ ఆడి టచ్‌లోకి వచ్చాడు. అంతేకాకుండా అతను ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్‌గా టీమిండియాకు ఉపయోగపడనున్నాడు.

భారత తుది జట్టు(అంచనా) వర్సెస్ అఫ్గానిస్థాన్:

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్.

Story first published: Sunday, June 16, 2024, 20:23 [IST]
Other articles published on Jun 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+