India Palying XI: సౌతాఫ్రికా పర్యటనను దిగ్విజయంగా ముగించిన టీమిండియా.. సొంతగడ్డపై మరో సిరీస్‌కు సిద్దమవుతోంది. జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా తలపడనుంది. ఈ ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచకప్ 2024 జరగనున్న నేపథ్యంలో ఈ మూడు టీ20ల సిరీస్‌కు ప్రాధాన్యత నెలకొంది.
మెగా టోర్నీకి ముందు టీమిండియా ఆడే ఏకైక టీ20 సిరీస్ ఇదే కావడంతో ప్రత్యర్థి అఫ్గానిస్థాన్ అయినా సీరియస్‌నెస్ నెలకొంది. ప్రపంచకప్ నేపథ్యంలోనే 14 నెలలుగా పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు.

ఈ సిరీస్ బరిలోకి దిగే భారత జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆదివారమే ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వగా.. గాయాల బారిన పడిన సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, మహమ్మద్ షమీలు ఈ సిరీస్‌కు కూడా దూరమయ్యారు.
మానసిక సమస్యలతో సౌతాఫ్రికా పర్యటన నుంచి బ్రేక్ తీసుకున్న ఇషాన్ కిషన్ సైతం దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ చోటు దక్కించుకున్నాడు. కోహ్లీ, రోహిత్ శర్మ రీఎంట్రీ నేపథ్యంలో తుది జట్టు అంచనా ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. జనవరి 11న మొహాలీ వేదికగా జరిగే తొలి టీ20లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌తో పాటు తొలి బంతి నుంచే హిట్టింగ్ చేయగల సామర్థ్యం యశస్వీకి ఉండటంతో శుభ్‌మన్ గిల్‌కు బదులు అతన్ని ఓపెనర్‌గా ఆడించే అవకాశం ఉంది. ఫస్ట్ డౌన్‌లో విరాట్ కోహ్లీ ఆడనుండగా.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్‌తో పాటు తిలక్ వర్మ, శివమ్ దూబేల్లో ఒకరు ఆడే ఛాన్స్ ఉంది. ఆల్‌రౌండర్‌కు ప్రాధాన్యత ఇస్తే శివమ్ దూబే జట్టులోకి వస్తాడు.
గత కొన్నాళ్లుగా టీ20 జట్టులో వరుసగా అవకాశాలు అందుకుంటున్న తిలక్ వర్మను ఆడించాలనుకుంటే మాత్రం అతనే బరిలోకి దిగుతాడు. ఐదో స్థానంలో రింకూ సింగ్ ఆడటం ఖాయం కాగా.. వికెట్ కీపర్‌గా జితేశ్ శర్మ బరిలోకి దిగనున్నాడు. సంజూ శాంసన్ కంటే అతనికే తొలి ప్రాధాన్యత దక్కనుంది. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్.. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు.
సౌతాఫ్రికా పర్యటనలో అక్షర్ పటేల్ విఫలమైనా.. కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. పేసర్లుగా అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, ముఖేశ్ కుమార్‌లు బరిలోకి దిగనున్నారు.
భారత తుది జట్టు(అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్/ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే/తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్‌దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్.