IND vs AFG: సంజూ ఇన్.. తెలుగోడికి నో ఛాన్స్! అఫ్గాన్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!
India Palying XI: సౌతాఫ్రికా పర్యటనను విజయంతో ముగించిన టీమిండియా.. సొంతగడ్డపై మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. అఫ్గానిస్థాన్‌తో గురువారం ప్రారంభం కానున్న మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. మొహాలీ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది.
ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024 ముందు టీమిండియా ఆడనున్న ఏకైక టీ20 సిరీస్ ఇదే కావడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా వన్డే ప్రపంచకప్ నేపథ్యంలోనే 14 నెలలుగా పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌తోనే టీ20 ఫార్మాట్‌లో రీఎంట్రీ ఇస్తున్నారు.

ఈ సిరీస్ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వగా.. గాయాల బారిన పడిన సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, మహమ్మద్ షమీలు ఈ సిరీస్‌కు ఎంపికవ్వలేదు.
మానసిక సమస్యలతో సౌతాఫ్రికా పర్యటన నుంచి బ్రేక్ తీసుకున్న ఇషాన్ కిషన్‌కు కూడా ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ చోటు దక్కించుకున్నాడు. ఇక మొహాలీ వేదికగా జరిగే తొలి టీ20కి విరాట్ కోహ్లీ దూరమయ్యాడని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.
వ్యక్తిగత కారణాలతో అతను తొలి మ్యాచ్ ఆడటం లేదని, చివరి రెండు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే తుది జట్టు అంచనా ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఓపెనర్లుగా రోహిత్, యశస్వీ..:
ఇక ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌తో పాటు తొలి బంతి నుంచే హిట్టింగ్ చేయగల సామర్థ్యం యశస్వీకి ఉండటంతో శుభ్‌మన్ గిల్‌కు బదులు అతన్ని ఓపెనర్‌గా ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తిలక్ ఔట్..:
యశస్వీ ఓపెనర్‌గా బరిలోకి దిగడం.. ఫస్ట్ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ దూరమవడంతో.. శుభ్‌మన్ గిల్ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. అయితే అతనికి తెలుగు తేజం తిలక్ వర్మ నుంచి పోటీ ఎదురుకానుంది. ఈ ఇద్దరిలో ఒకరు మాత్రం బెంచ్‌కు పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ బరిలోకి దిగనుండగా.. ఆరో స్థానంలో బిగ్ హిట్టర్ రింకూ సింగ్ ఆడనుండగా.. ఏడో స్థానంలో పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే బరిలోకి దిగనున్నాడు.
కుల్దీప్ యాదవ్‌కే ఛాన్స్..:
స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్.. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. సౌతాఫ్రికా పర్యటనలో అక్షర్ పటేల్ విఫలమైనా.. కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. పేసర్లుగా అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, ముఖేశ్ కుమార్‌లకు అవకాశం దక్కనుంది. శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే.. యశస్వీతో పాటు శివమ్ దూబే బెంచ్‌కు పరిమితమవుతాడు.
భారత తుది జట్టు(అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్/ తిలక్ వర్మ, సంజూ శాంసన్/జితేశ్ శర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే/తిలక్ వర్మ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్‌దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications