Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ.. ఇంగ్లండ్‌తో తొలి వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న టీమిండియా మరో కీలకపోరుకు సిద్దమైంది. అప్‌కమింగ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. గురువారం నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి వన్డేతో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బరిలోకి దిగే జట్టే ఈ సిరీస్ ఆడనుంది. మెగా టోర్నీకి ముందు ఈ మూడు వన్డేలను టీమిండియా సన్నాహకంగా ఉపయోగించుకోనుంది.

టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇవ్వనున్నారు. దాంతో టీమిండియా కాంబినేషన్ ఎలా ఉంటుదనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వెన్ను నొప్పితో జస్‌ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాడు. దాంతో పేస్ విభాగాన్ని ఎవరు నడిపిస్తారనేది కూడా చర్చనీయాంశమైంది.

India Palying XI For 1st ODI vs England Shubman Gill IN Yashasvi Jaiswal OUT And Rishabh Pant Doubt

ఓపెనర్‌గా ఎవరంటే..?
రోహిత్ శర్మకు జతగా ఎవరు ఓపెనింగ్ చేస్తారు? వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్, కేఎల్ రాహుల్‌లో ఎవరికి చోటు దక్కుతుందనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మారాయి. ఈ సందేహాలన్నింటికీ ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో పరిష్కారం లభించనుంది. ఇప్పటికే ఈ సిరీస్ బరిలో నిలిచే ఆటగాళ్లు నాగ్‌పూర్ చేరుకొని బీసీసీఐ నిర్వహిస్తున్న ప్రీ- ప్రాక్టీస్ క్యాంప్‌లో పాల్గొన్నారు.

రిషభ్ పంత్ డౌట్..
ఓపెనింగ్ జోడీలో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం చూస్తే.. యశస్వి జైస్వాల్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. అప్పుడు గిల్ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌కు బదులు కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతాడు. ఒకవేళ గిల్‌ను ఓపెనర్‌గా పరిగణలోకి తీసుకుంటే రిషభ్ పంత్ వికెట్ కీపర్‌గా ఆడుతాడు. అప్పుడు కేఎల్ రాహుల్ బెంచ్‌కే పరిమితమవుతాడు. యశస్వి జైస్వాల్ జట్టులోకి వస్తే శ్రేయస్ అయ్యర్‌ బెంచ్‌కు పరిమితం కానున్నాడు.

అక్షర్ పటేల్‌కు నోఛాన్స్..
విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా మిడిలార్డర్‌లో ఆడనుండగా.. స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. జడేజా రాకతో అక్షర్ పటేల్‌ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్‌లు ప్రధాన పేసర్లుగా ఆడనున్నారు. దుబాయ్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించనున్న నేపథ్యంలో టీమిండియా ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తోనే బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. భారత తుది జట్టు(అంచనా):
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(కీపర్)/కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ.

వన్డే సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(కీపర్), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్

Story first published: Monday, February 3, 2025, 14:35 [IST]
Other articles published on Feb 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+