Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ అత్యుత్తమ ప్లేయర్‌గా జస్‌ప్రీత్ బుమ్రా!

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024గా ఎంపికైన బుమ్రా.. తాజాగా ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024(సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ) అవార్డును కూడా గెలుచుకున్నాడు. భారత్‌ నుంచి ఈ ఘనతను అందుకున్న ఐదో క్రికెటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా ఈ ఘనతను అందుకున్న తొలి భారత పేసర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు.

గతేడాది జస్‌ప్రీత్ బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంతో ఐసీసీ అతన్ని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. దాంతో బుమ్రా.. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, రవిచంద్రన్ అశ్విన్‌ల సరసన నిలిచాడు. ట్రావిస్ హెడ్, హ్యారీ ట్రూక్, జో రూట్‌లను వెనక్కినెట్టి మరి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డ్‌ను గెలుచుకున్నాడు.

India Pacer Jasprit Bumrah Wins ICC Cricketer Of The Year 2024 Award

గతేడాది 13 టెస్ట్‌లు ఆడిన బుమ్రా 71 వికెట్లు పడగొట్టాడు. 8 టీ20ల్లో 15 వికెట్లు తీసాడు. అతని అద్భుత ప్రదర్శనతో టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024ను కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికయ్యాడు.

2004 నుంచి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఇస్తుండగా.. ఆ ఏడాది రాహుల్ ద్రవిడ్ ఈ ఘనతను అందుకున్నాడు. 2010లో సచిన్ టెండూల్కర్, 2016లో రవిచంద్రన్ అశ్విన్, 2017, 2018లో విరాట్ కోహ్లీ, 2024లో జస్‌ప్రీత్ బుమ్రాలు ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు.

ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ విన్నర్స్:

రాహుల్ ద్రవిడ్(భారత్)-2004

జాక్వస్ కల్లీస్(సౌతాఫ్రికా), ఆండ్రూ ఫ్లింటాఫ్(ఇంగ్లండ్)-2005

రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా)-2006

రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా)-2007

శివ్‌నారయణ్ చంద్రపాల్(వెస్టిండీస్)-2008

మిచెల్ జాన్సన్(ఆస్ట్రేలియా)-2009

సచిన్ టెండూల్కర్(భారత్)-2010

జోనాథన్ ట్రోట్(ఇంగ్లండ్)-2011

కుమార సంగక్కర(శ్రీలంక)-2012

మిచెల్ క్లార్క్(ఆస్ట్రేలియా)-2013

మిచెల్ జాన్సన్(ఆస్ట్రేలియా)-2014

స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా)-2015

రవిచంద్రన్ అశ్విన్(భారత్)-2016

విరాట్ కోహ్లీ(భారత్)-2017

విరాట్ కోహ్లీ(భారత్)-2018

బెన్ స్టోక్స్(ఇంగ్లండ్)-2019

షాహిన్ షా అఫ్రిది(పాకిస్థాన్)-2021

బాబర్ ఆజామ్(పాకిస్థాన్)-2022

ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)-2023

జస్‌ప్రీత్ బుమ్రా(భారత్)-2024

Story first published: Tuesday, January 28, 2025, 18:09 [IST]
Other articles published on Jan 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+