ఒకే ఓవర్‌లో 30 రన్స్ ఇచ్చి.. నా గర్ల్‌ఫ్రెండ్ ముందు వెక్కివెక్కి ఏడ్చా: ఇషాంత్

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 30 పరుగులు సమర్పించుకొని తీవ్ర మనోవేదనకు గురయ్యానని టీమిండియా స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ తెలిపాడు. తన కెరీర్‌లో అదే తన టర్నింగ్ పాయింట్ అని, ఆ మ్యాచ్ తర్వాత ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానన్నాడు. మూడు వారాల పాటు రూమ్ నుంచి బయటకు రాకుండా వెక్కివెక్కి ఏడ్చానని లంబూ చెప్పుకొచ్చాడు. తన జీవితంలో అత్యంత గడ్డు కాలం అదేనన్న ఇషాంత్.. ఆ తర్వాత ఆటపట్ల తన దృక్పథం మారిందని, మరింత కష్టపడేలా చేసిందన్నాడు. తాజాగా ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్‌ఫో 'క్రికెట్‌బాజీ'షోలో మాజీ క్రికెటర్ దీప్‌దాస్ గుప్తాతో మాట్లాడుతూ.. ఇషాంత్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఏదో ద్రోహం చేసాననే..
‘2013లో నా జీవితం మలుపు తిరిగింది. అదే ఏడాది మొహాలి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఓ వన్డేలో జేమ్స్ ఫాల్కనర్.. నేను వేసిన ఒకే ఓవర్లో 30 పరుగులు పిండుకున్నాడు. ఓటమి అంచుకు చేరుకున్న ఆసీస్‌కు అద్భుత విజయాన్నందించాడు. ఆ సమయంలో నా దేశానికి నేను ద్రోహం చేసానని ఫీలింగ్ నన్ను వెంటాడింది. ఎవరితో మాట్లాడకుండా రెండు, మూడు వారాలు వెక్కివెక్కి ఏడ్చాను.

నా గర్ల్‌ఫ్రెండ్ ముందు బోరుమన్నా..
నీ కన్నా ధైర్యమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదని మా అమ్మ నాతో అనేది. కానీ నేను మాత్రం నా గర్ల్ ఫ్రెండ్‌కు ఫోన్ చేసి చిన్నపిల్లాడిలా ఏడ్చాను. ఈ మూడు వారాలు నిద్రలేని రాత్రులు గడిపాను. తిండి తినడం ఆపేసా. సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదు. టీవీ ఆన్ చేస్తే అభిమానుల విమర్శలు వినిపిస్తాయని, అవి మరింత బాధను కలిగిస్తాయని అది కూడా చేయలేదు.

ఇప్పుడు నవ్వొస్తది..
ఇప్పుడు ఆ కఠిన పరిస్థితులు తలుచుకుంటే నవ్వొస్తది. ఆ గడ్డు కాలం నుంచి గట్టెక్కడం అదృష్టంగానే భావిస్తా. మన అభిరుచి మనకు అర్థం కావాలంటే ఇలాంటి సంఘటనలు జరగాలి. ఫాల్క్‌నర్ ఘటన తర్వాత నా జీవితంలో కొన్ని మార్పులు చేసుకున్నాను. ప్రతీ విషయాన్ని సీరియస్‌గా పరిగణించడం ప్రారంభించాను. అంతకు ముందు నేను చెత్తగా ఆడితే ఎవరో ఒకరు చెబుతారులే అనుకునేవాడిని. కానీ 2013 తర్వాత ఎవరు వచ్చి చెప్పినా వినవద్దనుకున్నా. నేను తప్పుచేస్తే బాధ్యత తీసుకోవాలనుకున్నా. ఇలాచేస్తేనే జట్టుకు విజయాన్నందించే ప్రదర్శన కనబర్చగలం'అని ఇషాంత్ అభిప్రాయపడ్డాడు.

ఇషాంత్ వల్ల గెలిచే మ్యాచ్..
ఇక సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన 7 వన్డేల సిరీస్‌లో భాగంగా మొహాలి వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో ఫాల్కనర్ చేతిలో ఇషాంత్ బలయ్యాడు. 18 బంతుల్లో 44 పరుగులు చేయాల్సిన క్రమంలో అప్పటి భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఇషాంత్‌కు బంతినివ్వగా అతను నాలుగు సిక్స్‌లతో 30 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో మ్యాచ్ ఆస్ట్రేలివైపు తిరిగి 4 వికెట్లతో గెలుపొందింది.ఈ విజయంతో సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఆ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 64 పరుగులు చేసి అద్భుత విజయాన్నందించిన ఫాల్కనర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ మ్యాచ్ అనంతరం ఇషాంత్‌ను జట్టు నుంచి తప్పించారు. దీంతో అతని ఆత్మవిశ్వాసం సన్నగిల్లడంతో పాటు కొంత డిప్రెషన్‌కు గురయ్యాడు. కాకపోతే ఆ సిరీస్‌ను భారత్ 3-2తో కైవసం చేసుకుంది. నాలుగో వన్డేలో ఫలితం తేలకపోగా.. ఐదో వన్డే రద్దయింది. ఇక 6, 7 వన్డేల్లో గెలిచిన భారత్ సిరీస్ గెలుచుకుంది.
పిల్లలను ఎప్పుడు కంటారని అడగ్గా.. అనుష్క ఏం చెప్పిందో తెలుసా?
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications