Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రన్ ఛేజ్‌లో కోహ్లీపైనే ఆధారపడ్డారా?: ధోని ఆన్సర్ ఇదీ

: భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 19 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 261 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా లక్ష్య ఛేదనలో తడబడి 48.4 ఓవర్లకే 241 పరుగులకే ఆలౌట్ అయింది.

ఈ విజయంలో ఐదు వన్డేల సిరీస్‌ 2-2తో సమం చేసింది. దీంతో వన్డే సిరిస్ విజేత ఎవరో చివరి ఐదో వన్డే ఈనెల 29న విశాఖపట్నంలో జరగనుంది. నాలుగో వన్డేలో రహానే అత్యధికంగా 57 పరుగులు చేయగా, కోహ్లీ 45 పరుగులతో రెండో స్ధానంలో నిలిచాడు.

ఐదు వన్డేల సిరిస్‌లో టీమిండియా గెలిచిన రెండు వన్డేల్లో కోహ్లీ రాణించడం వల్లే భారత విజయం సాధించింది. ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ 85 పరుగులతో రాణించగా, మొహాలిలో ఆదివారం జరిగిన మూడో వన్డేలో 154 నాటౌట్ రాణించడంతోనే టీమిండియా విజయం సాధించింది.

 India overdependent on Virat Kohli? - MS Dhoni gives his reply

మిగతా రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీ ఢిల్లీ వన్డేలో (9), రాంచీ వన్డేలో (45) స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో లక్ష్య ఛేదనలో తడబడింది. దీనిని బట్టి చూస్తుంటే రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీపైనే టీమిండియా ఆధారపడిందా? అనే అనుమానం కలుగుతోంది.

వన్డే రన్ ఛేజ్‌లో అత్యధిక యావరేజి ధోనిదే: ఆ తర్వాతే కోహ్లీఇదే ప్రశ్నని రాంచీలో నాలుగో వన్డే అనంతరం విలేకరులు ధోనిని ఆడగ్గా తనదైన శైలిలో స్పందించాడు. ' అలాంటిదేమీ లేదు(కోహ్లీపై ఎక్కువగా ఆధారపడ్డారా). గత ఏడాది కాలంగా చూస్తే టీమిండియా వన్డే క్రికెట్‌ను ఎక్కువగా ఆడలేదు. జింబాబ్వేతో 3 వన్డేలు మాత్రమే ఆడాం. కొంచెం కష్టంగానే ఉంటుంది' అని ధోని పేర్కొన్నాడు.

గతేడాదిగా చూసుకుంటే తాను అనేక స్ధానాల్లో బ్యాటింగ్‌కు వచ్చానని చెప్పాడు. తాను బ్యాటింగ్‌కు వెళ్లిన క్రమంలో టీమిండియా టాప్ ఆర్డర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని తెలిపాడు. అప్పటికి, ఇప్పటికి చాలా తేడా ఉందన్నాడు. ఈ సిరిస్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో వికెట్ బాగా స్లోగా ఉందని ధోని చెప్పాడు.

ఈ సిరిస్‌లో కొత్త కుర్రాళ్లు కావడంతో ఆ జాబ్‌ని సమర్ధవంతంగా నిర్వహించే వాళ్లు కొద్ది మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నాడు. వారికి ఇంకా ఎక్కువ సమయం ఇవ్వాల్సి ఉందని తెలిపాడు. కాగా లక్ష్య ఛేదనలో భాగాంగా కోహ్లీ ఇటీవలే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 14 సెంచరీల రికార్డుని సమం చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+