Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వన్డే రన్ ఛేజ్‌లో అత్యధిక యావరేజి ధోనిదే: ఆ తర్వాతే కోహ్లీ

రాంచీ: ఆదివారం మొహాలిలో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ క్రికెజ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని విరాట్ కోహ్లీ సమం చేసిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో రాస్ టేలర్ ఇచ్చిన లైఫ్‌తో చెలరేగి పోయిన కోహ్లీ తన కెరీర్‌లో 26 సెంచరీని నమోదు చేశాడు.

కోహ్లీ సెంచరీతో ఐదు వన్డేల సిరిస్‌లో భారత్ 2-1తేడాతో ముందంజలో ఉంది. మూడో వన్డేలో కోహ్లీ సెంచరీ సాధించడంతో సచిన్ రికార్డుని సమం చేశాడు. లక్ష్య ఛేదనలో భాగంగా కోహ్లీకి ఇది 14వ సెంచరీ. సచిన్ కూడా పరుగుల ఛేదనలో 14 సెంచరీలు చేయడం విశేషం.

అయితే కోహ్లీ ఈ 14 సెంచరీలను 59 ఇన్నింగ్స్‌లో చేస్తే, సచిన్ మాత్రం 124 ఇన్నింగ్స్‌లో నమోదు చేశాడు. మొత్తంగా చూస్తే రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 16 సెంచరీలు సాధించాడు. ఇక వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన నాలుగు ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ఇదే వన్డేలో 80 పరుగులు చేసిన ధోని... విజయవంతమైన వన్డే ఛేజ్‌లలో అత్యధిక యావరేజిని నమోదు చేసిన ఆటగాడిగా మహేంద్ర సింగ్ ధోని రికార్డు సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్‌గా పేరుగాంచిన ధోని తన కెరీర్‌లో మరో రికార్డుని సృష్టించాడు.

మహేంద్ర సింగ్ ధోని

మహేంద్ర సింగ్ ధోని

వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్న మహేంద్ర సింగ్ ధోని వన్డేల్లో పరుగుల ఛేజింగ్‌లో అత్యధిక యావరేజిని నమోదు చేశాడు. 2005 నుంచి 2016 మధ్య కాలంలో ధోని 88 వన్డేల్లో రెండో ఇన్నింగ్స్‌‌ ఆడాడు. ఇలా మొత్తం 62 ఇన్నింగ్స్ ఆడిన ధోని 2428 పరుగులు చేశాడు. దీంతో వన్డేల్లో సక్సెస్‌పుల్ యావరేజి 101.86గా ఉంది. ఛేజింగ్‌లో ధోని నమోదు చేసిన అత్యుత్తమ స్కోరు 183 నాటౌట్. అంతేకాదు రెండు సెంచరీలతో పాటు 16 అర్ధ సెంచరీలు సాధించాడు.

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

లక్ష్య ఛేదనలో భాగంగా ఇటీవల మొహాలిలో విరాట్ కోహ్లీకి చేసిన సెంచరీ 14వ సెంచరీ. ఈ సెంచరీతో క్రికెట్ లెజెండ్ ఛేజింగ్ సెంచరీలను కూడా సమం చేశాడు. సచిన్ కూడా పరుగుల ఛేదనలో 14 సెంచరీలు చేయడం విశేషం. అంతేకాదు కోహ్లీ 174 ఇన్నింగ్స్‌ల్లో 26 సెంచరీలు పూర్తి చేశాడు. అందులో 14 సెంచరీలు రెండోసారి బ్యాటింగ్‌కు దిగిన క్రమంలో సాధించాడు. ఇలా కోహ్లీ 59 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ 3514 పరుగులు చేశాడు. దీంతో వన్డేల్లో సక్సెస్‌పుల్ రన్ ఛేజ్ యావరేజి 90.10గా ఉంది. ధోని తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. అంతేకాదు ధోనిలాగే కోహ్లీ అత్యుత్తమ స్కోరు కూడా 183 కావడం విశేషం. రన్ ఛేజ్‌లో కోహ్లీ 59 ఇన్నింగ్స్‌ల్లో 15 అర్ధ సెంచరీలు సాధించాడు.

ఏబీ డివిలియర్స్

ఏబీ డివిలియర్స్

వన్డేల్లో సక్సెస్‌పుల్ రన్ ఛేజ్‌ యావరేజిలో మూడో స్ధానంలో దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. 2005 నుంచి 2016 మధ్య కాలంలో ఏబీ 57 మ్యాచ్‌లను ఆడాడు. మొత్తం 53 ఇన్నింగ్స్‌ ఆడిన ఏబీ డివిలియర్స్ 81.48 యావరేజితో 2363 పరుగులు చేశాడు. రన్ ఛేజ్‌లో ఏబీ అత్యధిక స్కోరు 136 నాటౌట్‌గా ఉన్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఏబీ 5 సెంచరీలు, 17 అర్ధ సెంచరీలు సాధించాడు.

మైఖెల్ క్లార్క్

మైఖెల్ క్లార్క్

వన్డేల్లో సక్సెస్‌పుల్ రన్ ఛేజ్‌ యావరేజిలో మైఖెల్ క్లార్క్ నాలుగో స్ధానంలో ఉన్నాడు. 2003 నుంచి 2015 మధ్య కాలంలో క్లార్క్ 68 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 53 ఇన్నింగ్స్‌ల్లో 73.86 యావరేజితో 2142 పరుగులు చేశాడు. రన్ ఛేజ్‌లో క్లార్క్ అత్యధిక స్కోరు 105 నాటౌట్‌గా ఉన్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో క్లార్క్ 3 సెంచరీలు, 17 అర్ధ సెంచరీలు సాధించాడు.

అర్జున రణతుంగ

అర్జున రణతుంగ

వరల్డ్ కప్ గెలిచిన శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా ఉన్న అర్జున రణతుంగ వన్డేల్లో సక్సెస్‌పుల్ రన్ ఛేజ్‌ యావరేజిలో ఐదో స్ధానంలో ఉన్నాడు. 1982 నుంచి 1999 మధ్య కాలంలో 62 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 56 ఇన్నింగ్స్‌లో 2007 పరుగుల సాధించాడు. రణతుంగ యావరేజి 69.20గా ఉంది. రన్ ఛేజ్‌లో రుణతుంగ అత్యధిక స్కోరు 103 నాటౌట్‌గా ఉన్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో రణతుంగ 1 సెంచరీతో పాటు 17 అర్ధ సెంచరీలు సాధించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+