
దేవతలతో ప్రేమలో పడవద్దంటూ..
ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం శుభ్‌మన్ గిల్.. 'దేవతలతో ప్రేమలో పడకూడదు'అని ఓ పోస్ట్ షేర్ చేశాడు. దాంతో సారా టెండూల్కర్‌తో శుభ్‌మన్‌కు బ్రేకప్ అయ్యిందనే ప్రచారం ఊపందుకుంది. ఆ తర్వాత సారా అలీఖాన్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ డిన్నర్‌కు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఈ డిన్నర్‌కు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. దాంతో సారా అలీఖాన్‌తో శుభ్‌మన్ ప్రేమాయణం నిజమేనని అంతా అనుకున్నారు.

డేటింగ్ నిజమే అంటూ..
ప్రస్తుతం కెరీర్ పరంగా జోష్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ తాజాగా ఓ పంజాబీ చాట్ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సారా అలీ ఖాన్‌తో ప్రేమాయణం గురించి స్పందించగా.. తెలివిగా సమాధానమిచ్చాడు. మీరు సారాతో డేటింగ్ చేస్తున్నారా? అని ప్రశ్నించగా.. శుభ్‌మన్ అతి తెలివి ప్రదర్శించాడు. సారా కా సారా సచ్ బోలో(సారా గురించి ఉన్నది ఉన్నట్లుగా మొత్తం నిజం చెప్పేయాలి) అనగా.. ''సారా కా సారా సచ్ బోల్ దియా (మొత్తం నిజం చెప్పేశాను) నేను డేటింగ్‌లో ఉండొచ్చు.. ఉండకపోవచ్చు'అని బదులిచ్చాడు.

సారా పేరు చెప్పడంతో..
ఇక బాలీవుడ్‌లో అత్యంత ఫిట్‌గా ఉండే నటి ఎవరని అడగ్గా.. ''సారా'' అంటూ గిల్ బదులివ్వడం విశేషం. దీంతో గిల్- సారా ప్రేమ నిజమేనని ఈ యువ క్రికెటర్ అంగీకరించాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. టీమిండియా భవిష్యత్తు తారాగా అందరి మన్ననలు అందుకుంటున్న శుభ్‌మన్ గిల్.. సుదీర్ఘ ఫార్మాట్‌తో పాటు వన్డేల్లోనూ సత్తా చాటాడు. ఇప్పుడు టీ20ల్లో అరంగేట్రం చేసేందుకు సిద్దమవుతున్నాడు.

టీ20ల్లోనూ సత్తా చాటేందుకు..
న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని జట్టులో శుభ్‌మన్‌కు అవకాశం దక్కింది. ఇప్పటి వరకు 12 వన్డేలు ఆడిన శుభ్‌మన్ గిల్.. 579 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది. 11 టెస్టులాడి 579 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్లు విఫలమైన నేపథ్యంలో శుభ్‌మన్‌ను రెగ్యులర్ ఓపెనర్‌గా జట్టులో కొనసాగించాలనే డిమాండ్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications












