న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతర్జాతీయ క్రికెట్‌‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా స్టార్ ఓపెనర్!

India Opener Murali Vijay announces retirement from all forms of cricket

చెన్నై: టీమిండియా స్టార్ ఓపెనర్, తమిళనాడు క్రికెటర్‌ మురళి విజయ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 16 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నానని సోమవారం ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ఈ సందర్భంగా సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేసిన మురళీ విజయ్.. కెరీర్‌లో తనకు అండగానిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. 16 ఏళ్ల (2002-2018) పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నాని మురళీ విజయ్ పేర్కొన్నాడు.

అందరికీ థ్యాంక్స్..

'నాకు అవకాశాలు కల్పించిన బీసీసీఐ, తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, చెమ్‌ప్లాస్ట్‌ సన్మార్‌ ఫ్రాంచైజీ యజమాన్యాలకు కృతజ్ఞతలు. నాతో కలిసి ఆడిన ఆటగాళ్లు.. మార్గనిర్దేశకం చేసిన కోచ్‌లు, మెంటార్స్‌కు స్పెషల్ థ్యాంక్స్.

కెరీర్‌లో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పుడు అండగా నిలిచిన అభిమానులకు జీవితాంతం రుణపడి ఉంటాను. నాపై అన్‌ కండిషనల్‌ లవ్‌ చూపిన నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. నా సెకెండ్‌ ఇన్నింగ్స్‌ను క్రికెట్‌కు సంబంధించిన వ్యాపారంలో కొనసాగించాలనుకుంటున్నాను'అని మురళీ విజయ్ స్పష్టం చేశాడు.

2018లో చివరిసారిగా..

2018లో చివరిసారిగా..

ఇక 38 ఏళ్ల మురళీ విజయ్‌ భారత్ తరఫున చివరిసారిగా 2018 డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో ఆడాడు. భారత్ తరఫున 61 టెస్ట్‌లు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 15 హాఫ్‌ సెంచరీల సాయంతో 3982 పరుగులు చేసిన విజయ్‌.. వన్డేల్లో ఒక హాఫ్‌ సెంచరీ సాయంతో 339 పరుగులు, టీ20ల్లో 169 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో 106 మ్యాచ్‌లు ఆడిన విజయ్‌.. 2 సెంచరీలు, 13 హాఫ్‌ సెంచరీల సాయంతో 2619 పరుగులు చేశాడు. గౌతమ్ గంభీర్ రిటైర్మెంట్ అనంతరం టెస్ట్‌ల్లో ప్రధాన ఓపెనర్‌గా కొనసాగిన మురళీ విజయ్.. తర్వాత పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయాడు. రోహిత్ శర్మ ఓపెనర్‌గా ప్రమోషన్ అందుకున్న తర్వాత అతనికి అవకాశమే లేకుండా పోయింది.

ఐపీఎల్‌లో..

ఐపీఎల్‌లో..

ఐపీఎల్‌‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ జట్లకు ముళీ విజయ్ ప్రాతినిధ్యం వహించాడు. అలాగే కౌంటీల్లో ఎసెక్స్‌, సోమర్‌సెట్‌ జట్ల తరఫున ఆడాడు. విజయ్‌కు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌తో పాటు లిస్ట్‌-ఏ క్రికెట్‌లోనూ మంచి ట్రాక్‌ రికార్డు ఉంది.

రిటైర్మెంట్‌ వయసుకు సంబంధించి విజయ్‌ ఇటీవలే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్‌ క్రికెట్‌లో 30 ఏళ్లు దాటితే 80 ఏళ్ల వృద్ధుడిలా చూస్తారని షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఈ ప్రకటన చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే విజయ్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించాడు.

దినేశ్ కార్తీక్‌ను మోసం చేయడంతో..

దినేశ్ కార్తీక్‌ను మోసం చేయడంతో..

తన క్లోజ్ ఫ్రెండ్ అయిన దినేశ్ కార్తీక్‌ మొదటి భార్యను పెళ్లి చేసుకున్న మురళీ విజయ్‌‌.. అభిమానుల దృష్టిలో ఓ విలన్‌లా మారిపోయాడు. దినేశ్ కార్తీక్ సక్సెస్ సాధించిన ప్రతీసారి మురళీ విజయ్‌ని అతని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు. క్లోజ్ ఫ్రెండ్ అయిన మురళీ విజయ్.. దినేశ్ కార్తీక్‌కు తెలియకుండా అతని మొదటి భార్యతో ఎఫైర్ కొనసాగించాడు. తమిళనాడుకు ఆడే సమయంలో దినేశ్ కార్తీక్‌కు మినహా జట్టులో ఉన్న వారందరికీ ఈ విషయం తెలుసు. ఈ మోసంతో కుంగిపోయిన కార్తీక్.. దీపికా పల్లికల్ ప్రేమతో తేరుకున్నాడు.

Story first published: Monday, January 30, 2023, 18:30 [IST]
Other articles published on Jan 30, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X