For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతనే నా ఫేవరేట్ తెలుగు హీరో: అభిషేక్ శర్మ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తనకు చాలా ఇష్టమని టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తెలిపాడు. ఖాళీ సమయంలో మహేష్ బాబు సినిమాలు చూస్తానని, ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడే సమయంలో తెలుగు సినిమాల గురించి సహచర ఆటగాళ్లతో బాగా చర్చిస్తానని చెప్పుకొచ్చాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా తనకు పిచ్చెక్కించిందని తెలిపాడు.

ఈ సినిమాలోని అల్లు అర్జున్ మేనరిజమ్ తనను బాగా ఆకట్టుకుందని చెప్పాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిషేక్ శర్మ దుమ్మురేపుతున్నాడు. తొలి టీ20లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగిన అభిషేక్.. రెండో టీ20లో మాత్రం గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మూడో టీ20లో మరోసారి తన విశ్వరూపం చూపించాడు. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది 10 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాడు. నాలుగో టీ20లో మరోసారి అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దాంతో ఈ మ్యాచ్‌లో భారత్ 50 పరుగుల తేడాతో చిత్తయ్యింది.

ప్రత్యర్థి బౌలర్లకు సింహ స్వప్నంగా మారిన అభిషేక్ శర్మ.. టీమిండియాకు కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. ఎంతలా అంటే అభిషేక్‌ను ఔట్ చేస్తే మ్యాచ్ గెలిచినట్లేనని ప్రత్యర్థి కెప్టెన్లు ఫీలయ్యేంత. గతంలో విరాట్ కోహ్లీ ఈ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకోగా.. అతని స్థానాన్ని అభిషేక్ శర్మ ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడు.

India Opener Abhishek Sharma Reveals His Favourite Telugu Hero
Photo Credit: twitter (X)

మహేష్ బాబు అంటే ఇష్టం..

గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్ శర్మ.. తెలుగు అభిమానులకు సుపరిచితమే. సినిమా, క్రికెట్‌ అంటే పడిచచ్చే తెలుగు ఫ్యాన్స్.. అభిషేక్ శర్మ ఫేవరేట్ తెలుగు హీరో గురించి తెలుసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ నిర్వహించిన ఒక ఫన్ ఇంటర్వ్యూలో అభిషేక్ శర్మ.. తన ఫేవరేట్ తెలుగు హీరో మహేష్ బాబు అని తెలియజేశాడు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మహేష్ బాబు సినిమాల గురించి, ఆయనకు ఉన్న క్రేజ్ గురించి తన సహచర తెలుగు ఆటగాళ్లను అడిగి తెలుసుకుంటుంటానని చెప్పాడు.

అల్లు అర్జున్ మేనరిజమ్..

తాను తెలుగు సినిమా చూస్తానని, అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా బాగా నచ్చిందని చెప్పాడు. ఈ సినిమాలోని అల్లు అర్జున్ మేనరిజమ్స్‌ను మైదానంలో కూడా అనుకరించాడు. అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ ఇష్టమని ఓ ఇంటరాక్షన్‌లో తెలిపాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపించాడు. ముఖ్యంగా నాటు నాటు పాట బాగుందని, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్ అద్భుతమైని కొనియాడాడు.

తెలుగు ప్లేయర్లు నితీష్ రెడ్డి, తిలక్ వర్మల సాయంతో తెలుగు డైలాగ్స్ నేర్చుకుంటానని చెప్పాడు. హైదరాబాద్‌ బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టమని, రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్ చూడాలని ఉందని తెలిపాడు.

Story first published: Thursday, January 29, 2026, 17:45 [IST]
Other articles published on Jan 29, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+