
పంత్ సెంచరీ చేస్తే..
ఓ సెంటిమెంట్ కూడా ఇప్పుడు టీమిండియా అభిమానులు కరవరపెడుతుంది. సేనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో రిషభ్ పంత్ సెంచరీ చేసిన ప్రతీసారి భారత్‌కు ప్రతికూల ఫలితమే ఎదురైంది. తాజా మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన రిషభ్ పంత్(146), రెండో ఇన్నింగ్స్‌లో 57 పరుగులతో రాణించాడు. ఈ సెంచరీతో కలుపుకొని ఇప్పటి వరకు సేనా దేశాల్లో పంత్ నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. ఇందులో రెండు సార్లు ఓడిపోగా.. మరోసారి డ్రా అయ్యింది. తాజా మ్యాచ్ ఓటమి దిశగా సాగుతోంది.

ఒక్కసారి డ్రా..
2018లో ఇంగ్లండ్‌తో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంత్ సెంచరీ నమోదు చేయగా.. ఆ మ్యాచ్ భారత్ ఓటమిపాలైంది. 2019లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాపై పంత్ శతకం బాదగా.. ఆ మ్యాచ్‌లోనూ ప్రతికూల ఫలితం ఎదురైంది. ఇక సౌతాఫ్రికాతో న్యూలాండ్స్ వేదికగా పంత్ సెంచరీ చేయగా.. ఆ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. ప్రస్తుతం ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రతికూల ఫలితం ఎదురయ్యే పరిస్థితి నెలకొంది.

భారత్ బ్యాటింగ్ వైఫల్యం..
నాలుగో రోజు ఆటను పుజారా (168 బంతుల్లో 66; 8 ఫోర్లు), పంత్ కొన్ని చక్కటి షాట్లతో ఆరంభించడంతో తొలి 7 ఓవర్లలో 27 పరుగులు వచ్చాయి. అయితే స్టువర్ట్ బ్రాడ్ తన తొలి ఓవర్లోనే పుజారాను అవుట్ చేసి 78 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెర దించాడు. భారత్ ఆధిక్యం 300 పరుగులు దాటిన తర్వాత 76 బంతుల్లో పంత్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అనంతరం ఎనిమిది పరుగుల వ్యవధిలో పంత్, శ్రేయస్ అయ్యర్ (19) అవుట్ కావడంతో భారత్ కాస్త నెమ్మదించింది. రవీంద్ర జడేజా (23) కొద్ది సేపు గట్టిగా నిలబడినా, శార్దుల్ ఠాకూర్ (4) విఫలమయ్యాడు. చివరి వరుస వికెట్లను పెద్దగా ఇబ్బంది పడకుండా వెంటవెంటనే పడగొట్టిన ఇంగ్లండ్ బౌలర్లు భారత్ ఇన్నింగ్స్‌ను తొందరగా ముగించారు. సోమవారం 36.5 ఓవర్లు ఆడిన టీమిండియా మిగిలిన 7 వికెట్లతో 120 పరుగులు సాధించింది.

సంక్షిప్త స్కోర్లు..
భారత్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్(రిషభ్ పంత్ 146, రవీంద్రజడేజా 104, జేమ్స్ అండర్సన్ 5/60)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్(జానీ బెయిర్ స్టో 106, సామ్ బిల్లింగ్స్ 36, మహమ్మద్ సిరాజ్ 4/66)
భారత్ రెండో ఇన్నింగ్స్ 245 ఆలౌట్( పుజారా 66, రిషభ్ పంత్ 57, బెన్ స్టోక్స్ 4/33)
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ : 57 ఓవర్లలో 259/3 (బెయిర్ స్టో 72 బ్యాటింగ్, జోరూట్ 76 బ్యాటింగ్)


Click it and Unblock the Notifications
