అఫ్గాన్‌తో ఏకైక టెస్ట్.. కొత్తగా ఏడుగురు బౌలర్లకు బీసీసీఐ పిలుపు!
భారత్ అఫ్గానిస్థాన్ ఏకైక టెస్ట్ మ్యాచ్ శనివారం(జూన్ 6) మొదలవ్వనుంది. ఈ మ్యాచ్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన జమ్మూ కశ్మీర్ పేస్ సెన్సేషన్, రంజీ కింగ్ ఆఖిబ్ నబీదార్‌కు ఎట్టకేలకు పిలుపు దక్కింది. అయితే ప్రధాన పేసర్‌గా కాకుండా నెట్‌బౌలర్‌గా నబీకి సెలెక్టర్లు అవకాశం కల్పించారు. న్యూ ఛండీఘర్ వేదికగా గత సోమవారమే(జూన్ 1) టీమిండియా టెస్ట్ క్యాంప్ మొదలైంది.
ఆకిబ్ నబీతో పాటు మొత్తం ఏడుగురు బౌలర్లను బీసీసీఐ నెట్ బౌలర్లుగా ఎంపిక చేసింది. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్, ఉత్తరప్రదేశ్ లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ కూడా ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శివాంగ్ కుమార్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ గుర్‌జప్నీత్ సింగ్, లక్నో పేసర్ ప్రిన్స్ యాదవ్, ఆఫ్ స్పిన్నర్ సరన్ష్ జైన్‌లు కూడా నెట్‌బౌలర్లుగా భారత జట్టుకు సేవలందించే అవకాశాన్ని అందుకున్నారు.
ఆరుగురు నెట్ బౌలర్లు.. ఎందుకంటే..?
ఈ విషయాన్ని బీసీసీఐ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. 'గుర్‌జప్నీత్ సింగ్, ఆఖిబ్ నబీ, ప్రిన్స్ యాదవ్, సరన్ష్ జైన్, జీషన్ అన్సారీ, శివంగ్ కుమార్ టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టుకు సహాయపడే నెట్ బౌలర్‌లుగా చేరారు'అని పేర్కొంది. ఇంత మందిని నెట్ బౌలర్లుగా ఎంపిక చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ నిర్ణయం వెనుక బలమైన కారణం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
'ప్రధాన పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ గత ఏడు రోజుల్లో మూడు కఠినమైన మ్యాచ్‌లు ఆడారు. సదూర ప్రయాణాల వల్ల అలసిపోయారు. కఠిన వాతావరణంలో నెట్ ప్రాక్టీస్‌లో వారు పూర్తిగా బౌలింగ్ చేయలేరు. బ్యాటర్లకు తగినంత ప్రాక్టీస్ అందించడం చాలా ముఖ్యం. దాంతోనే ఏడుగురు నెట్ బౌలర్లను తీసుకోవాల్సి వచ్చింది.'అని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపాడు.

సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కేవలం ఐదు రోజులలో ఐపీఎల్ క్వాలిఫైయర్ 1, 2, ఫైనల్ మ్యాచ్‌ల్లో ఆడారు. ధర్మశాల, న్యూ చంఢీగర్, అహ్మదాబాద్ వంటి విభిన్న ప్రదేశాలకు వారు చేసిన సదూర ప్రయాణాలు చేశారు. దాంతో వారిపై వర్క్ లోడ్ ఎక్కువైంది.
60 వికెట్లు తీసినా..
రంజీ 2025 26 సీజన్‌లో జమ్మూ కశ్మీర్ జట్టు విజేతగా నిలవడంలో ఆఖిబ్ నబీ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీ అత్యధికంగా 60 వికెట్లు పడగొట్టాడు. అయినా అతనికి భారత జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో పంజాబ్‌కు చెందిన గుర్నూర్ బ్రార్‌ను ఎంపిక చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. రంజీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన తర్వాత కూడా గుర్తింపు లేకపోతే ఆ టోర్నీకి ఉన్న విలువ ఏంటి? అని దిలీప్ వెంగ్ సర్కార్ ప్రశ్నించగా.. రంజీ ట్రోఫీని మూసేయాలని సంజయ్ మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
నెట్‌బౌలర్‌గా భారత ప్రాక్టీస్ క్యాంప్‌లో చేరిన ఆఖిబ్ నబీ.. ఎవరైన గాయపడితే ప్రధాన జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్‌లో ఎవరూ గాయపడినా.. నబీ భారత టెస్ట్ టీమ్‌లోకి వస్తాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి మొత్తం ఏడుగురు ఆటగాళ్లు భారత టెస్ట్ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, బి. సాయి సుదర్శన్, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

