Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: శ్రీలంక మైండ్‌గేమ్.. వామప్ మ్యాచ్‌‌ పిచ్‌పై టీమిండియా అసంతృప్తి!

భారత్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు శ్రీలంక మైండ్ గేమ్ మొదలుపెట్టింది. వామప్ మ్యాచ్‌కు పేస్‌కు అనుకూలంగా ఉండే వికెట్‌ను సిద్దం చేసింది. స్పిన్ కండిషన్స్‌కు భారత్ అలవాటుపడవద్దనే వ్యూహంతో ఈ పని చేసింది. శ్రీలంక ఎలెవన్‌తో శుక్రవారం నుంచి భారత జట్టు మూడు రోజుల వామప్ మ్యాచ్ ఆడనుంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌కు స్పిన్‌కు అనుకూలంగా ఉండే కొలంబోలోని ఎన్‌సీసీ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది.

శ్రీలంకతో టెస్ట్ సిరీస్.. ఆటగాళ్లకు అది నూరిపోసిన గంభీర్!(వీడియో)

శ్రీలంకతో టెస్ట్ సిరీస్.. ఆటగాళ్లకు అది నూరిపోసిన గంభీర్!(వీడియో)

అయితే ఈ వామప్ మ్యాచ్‌లో స్పిన్ కండిషన్స్‌కు అనుకూలంగా వికెట్ ఉంటుందని భారత మేనేజ్‌మెంట్ భావించింది. కానీ పిచ్ పరిశీలించిన తర్వాత వికెట్‌పై పూర్తిగా పచ్చగడ్డిని చూసి షాక్ అయ్యింది. ఈ సన్నాహక వికెట్‌పై టీమిండియా మేనేజ్‌మెంట్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

India Management Unhappy with Grass-Heavy Pitch for Sri Lanka Warm-Up Match Ahead of Galle Test

అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు ఆదేశాలతోనే ఈ పిచ్‌ను రూపొందించామని ఎన్‌సీసీ గ్రౌండ్‌లోని సీనియర్ అధికారి ఏ ఫ్రాంకే తెలిపాడు. పిచ్‌పై గడ్డి ఉన్న మాట వాస్తవమేనన్నాడు. 3 రోజుల టెస్ట్ మ్యాచ్ కోసం పూర్తిగా పొడి పిచ్‌ను అందించడం సాధ్యం కాదని, మ్యాచ్ రెండో రోజు లేదా మూడో రోజు నుంచే స్పిన్నర్లకు అనుకూలిస్తోందని చెప్పాడు.

టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేయడం మంచిదని సలహా ఇచ్చాడు. ఎన్‌సీసీ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి భారత బ్యాటర్లు ఇక్కడ పరుగులు సాధించి, పిచ్‌పై ఎక్కువ సమయం గడపడానికి ఇది ఒక మంచి అవకాశమని ఆయన అన్నారు.

IND vs SL: టీమిండియాకు బిగ్ షాక్.. తొలి టెస్ట్‌కు ముందు స్టార్ ప్లేయర్‌కు గాయం!

Also Read

IND vs SL: టీమిండియాకు బిగ్ షాక్.. తొలి టెస్ట్‌కు ముందు స్టార్ ప్లేయర్‌కు గాయం!

వాస్తవానికి మొదటి రోజు నుంచే స్పిన్‌కు అనుకూలంగా ఉండే వికెట్‌ను భారత్ ఆశించింది. కానీ పచ్చి గడ్డితో కూడిన పిచ్‌ను రెడీ చేయడంతో వారు పేస్ బౌలింగ్, స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెస్ట్ సిరీస్ ఆడటానికి వచ్చే ఆతిథ్య జట్లకు ఇలా భిన్నమైన ప్రాక్టీస్ వికెట్లు అందించడం సర్వసాధారణం. అయితే 9 ఏళ్ల తర్వాత శ్రీలంకలో టెస్ట్ సిరీస్‌ ఆడుతున్న భారత జట్టుకు పేస్‌కు అనుకూలమైన వామప్ వికెట్‌ను ఉద్దేశపూర్వకంగానే కేటాయించారు. అక్కడి స్పిన్ కండిషన్స్‌కు అలవాటు పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

Story first published: Thursday, August 6, 2026, 19:24 [IST]
Other articles published on Aug 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+