Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Maharajas vs World Giants: కల్లీస్ సేనదే బ్యాటింగ్! మహిళా అంపైర్లతో మ్యాచ్ ఎందుకంటే..?

 India Maharajas vs World Giants: Pathan, Sreesanth eye early wickets after WGS opt to bat against INM

కోల్‌కతా: లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 సీజన్‌లో భాగంగా ఇండియా మహరాజాస్‌తో జరుగుతున్న చారిటీ మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ల్లో భాగంగా ఈ ప్రత్యేక మ్యాచ్‌ను బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ఈ మ్యాచ్‌లో ఇండియా మహరాజాస్ జట్టుకు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ నాయకత్వం వహిస్తాడని ప్రచారం జరిగినా.. అతను వ్యక్తిగత కారణాలతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దాంతో హర్భజన్ సింగ్ టీమ్‌ను నడిపిస్తున్నారు. హర్భజన్‌తో పాటు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థీవ్ పటేల్, మహమ్మద్ కైఫ్, యూసఫ్ పఠాన్, శ్రీశాంత్‌ బరిలోకి దిగారు.

వరల్డ్ జెయింట్స్ టీమ్‌ను జాక్వస్ కల్లీస్ నడిపిస్తున్నాడు. అతనితో పాటు డానియల్ వెటోరి మాంటీ పనేసర్, డానియల్ వెటోరి, తిసారా పెరెరా ఈ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ చారిటీ మ్యాచ్ ద్వారా వచ్చే డబ్బులను దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్‌కు చెందిన స్వచ్చంద సంస్థ ఖుషి ఫౌండేషన్‌కు అందజేయనున్నారు. 2003లో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రారంభించిన స్వచ్చంద సంస్థ ఖుషి ఫౌండేషన్.. దేశంలోని చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తోంది. ముఖ్యంగా పేద పిల్లలను స్కూళ్లకు పంపించడంలో ఖుషి ఫౌండేషన్ సక్సెస్ అయ్యింది. గత 17 ఏళ్లలో సుమారు 15 లక్షల పిల్లల జీవితాలను మార్చింది.

పేదరికంతో ఉన్నత చదువులు చదవలేని బాలికలు, యువతులకు ఈ ఫౌండేషన్ అండగా నిలుస్తుంది. దేశవ్యాప్తంగా బాలికల విద్య కోసం పాటుపడుతోంది. మహిళల సాధికారత కోసం ఈ మ్యాచ్‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో మహిళా అంపైర్లు అంపైరింగ్ చేస్తున్నారు. మ్యాచ్ రిఫరీతో పాటు అంపైర్లు, టీవీ అంపైర్లు కూడా మహిళలే కావడం విశేషం. భారత్‌లో ఓ పురుషుల క్రికెట్ మ్యాచ్‌కు మహిళా అంపైర్లు ఉండటం ఇదే తొలిసారి. లీగ్ మొత్తం మహిళలే అంపైరింగ్ చేయనున్నారు.

తుది జట్లు:
వరల్డ్ జెయింట్స్: జాక్వస్ కల్లీస్(కెప్టెన్), దినేశ్ రామ్‌దిన్, టీమ్ బ్రెస్నాన్, ఫిడెల్ ఎడ్వార్డ్స్, ముత్తయ్య మురళీదరన్, మాంటీ పనేసర్, డానియల్ వెటోరీ, తిసారా పెరీరా, టాటెండ టైబు

ఇండియా మహరాజస్: వీరేంద్ర సెహ్వాగ్, పార్థీవ్ పటేల్, మహమ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, జోగిందర్ శర్మ, పంకజ్ సింగ్, శ్రీశాంత్, తన్మయ్ శ్రీవాత్సవ్, మన్విందర్ బిస్లా

Story first published: Friday, September 16, 2022, 20:08 [IST]
Other articles published on Sep 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+