For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Women's T20 World Cup: పాక్‌పై విజయం.. టీమిండియా సెమీస్ చేరాలంటే..?

మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌తో 58 పరుగులతో ఖంగుతిన్న టీమిండియా.. దాయాదీ పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ముందుగా బౌలింగ్‌లో సత్తా చాటి పాక్‌ను స్వల్ప స్కోర్‌కు పరిమితం చేసిన హర్మన్ సేన.. ఆ తర్వాత పిచ్ తగ్గట్లు బ్యాటింగ్‌ చేసి విజయాన్నందుకుంది. కానీ ఈ విజయం భారత్ రన్‌రేట్‌ను మెరుగుపర్చలేదు. పాకిస్థాన్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని ఆపసోపాలు పడుతూ టీమిండియా చేధించింది. దాంతో టీమిండియా రన్ రేట్(-1.217) నెగటీవ్‌గానే ఉంది.

India lost golden chance to improve NRR in maiden T20 World Cup 2024 win vs Pakistan

స్లో బ్యాటింగ్‌తో..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 105 పరుగులే చేసింది. నిదా దార్(34 బంతుల్లో ఫోర్‌తో 28) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో తెలుగు తేజం అరుందతి రెడ్డి(3/19) మూడు వికెట్లతో సత్తా చాటగా.. రేణుక సింగ్, దీప్తి శర్మ తలో వికెట్ తీసారు. శ్రేయాంక పాటిల్‌కు రెండు వికెట్లు దక్కాయి.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 108 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(7) విఫలమైనా.. షెఫాలీ వర్మ(35 బంతుల్లో 3 ఫోర్లతో 32), జెమీమా రోడ్రిగ్స్(28 బంతుల్లో 23), హర్మన్‌ప్రీత్ కౌర్(24 బంతుల్లో ఫోర్‌తో 29) ఆచితూచి ఆడి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. పాకిస్థాన్ బౌలర్లలో ఫతిమా సనా(2/23) రెండు వికెట్లు తీయగా.. సదియా ఇక్బాల్, ఓమైమా సోహైల్ తలో వికెట్ తీసారు.

సెమీస్ చేరాలంటే..?
గ్రూప్-ఏలో ఉన్న టీమిండియా ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతోంది. భారత్‌పై భారీ విజయం సాధించిన న్యూజిలాండ్ 2.900 రన్ రేట్‌తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. భారత్ చేతిలో పాక్ ఓడినా.. 0.555 మెరుగైన రన్‌రేట్‌తో ముందంజలో ఉంది. ప్రతీ గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్ చేరుతాయి.

భారత్ సెమీస్ చేరాలంటే తమ చివరి రెండు మ్యాచ్‌లను తప్పనిసరిగా గెలవాలి. రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోవాలి. న్యూజిలాండ్ ఒక మ్యాచ్‌లో ఓడిపోవాలి. ఒకవేళ భారత్ చివరి రెండు మ్యాచ్‌లు గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రతీ జట్టు మూడేసి విజయాలు సాధిస్తే మెరుగైన రన్‌రేట్ ఉన్న టీమ్ సెమీస్‌కు అర్హత సాధిస్తోంది.

పాకిస్థాన్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని త్వరగా చేధించి రన్‌రేట్ మెరుగుపరుచుకునే సువర్ణవకాశాన్ని భారత్ చేజార్చుకుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పిచ్ బ్యాటింగ్‌కు కఠినంగా ఉండటంతోనే నెమ్మదిగా ఆడామని టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది.

Story first published: Sunday, October 6, 2024, 21:59 [IST]
Other articles published on Oct 6, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+