Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: తొలి టెస్ట్‌కు ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా.. సర్ఫరాజ్‌కు చోటు!

రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరగనున్న తొలి టెస్ట్‌లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. శనివారం గాలే వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలోని పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉండనుంది. తొలి రెండు రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, ఆ తర్వాత మూడు రోజులు స్పిన్నర్లకు సహకరిస్తుందని పిచ్‌ రిపోర్ట్ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

శుభ్‌మన్ గిల్ కాదు.. అతనే మా ఎక్స్-ఫ్యాక్టర్: టీమిండియా బౌలింగ్ కోచ్

శుభ్‌మన్ గిల్ కాదు.. అతనే మా ఎక్స్-ఫ్యాక్టర్: టీమిండియా బౌలింగ్ కోచ్

గురువారం పిచ్‌ను భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పరీక్షించారు. భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉందని మోర్నీ మోర్కెల్ మీడియాకు వెల్లడించాడు. ముగ్గురు స్పిన్నర్లు అటాక్ చేస్తే.. ఇద్దరు పేసర్లు ఒత్తిడిని పెంచుతారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికైతే తుది జట్టు ఇంకా ఖరారు చేయలేదని పేర్కొన్నాడు.

IND vs SL India Likely to Play Two Pacers and Three Spinners in Galle Test Sarfaraz Khan Set to Replace Dhruv Jurel

మానవ్ సుతార్ X సారాన్ష్ జైన్..

కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా బరిలోకి దిగనుండగా.. మూడో స్పిన్నర్ కోసం మానవ్ సుతార్, సరాన్ష్ జైన్ మధ్య పోటీ నెలకొంది. ఆఫ్ స్పిన్‌కు ప్రాధాన్యత ఇస్తే సారాన్ష్ జైన్ బరిలోకి దిగుతాడు. పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ బరిలోకి దిగనున్నారు. అయితే ప్రసిధ్ కృష్ణకు గుర్నూర్ బ్రార్‌తో పోటీ నెలకొంది. బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. గాయంతో దూరమైన సాయి సుదర్శన్ స్థానంలో దేవదత్ పడిక్కల్ ఆడనుండగా.. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగనున్నారు.

వ్యక్తి పూజను పక్కన పెట్టండి.. శ్రీలంకను ఓడించడం అంత ఈజీ కాదు: గవాస్కర్

Also Read

వ్యక్తి పూజను పక్కన పెట్టండి.. శ్రీలంకను ఓడించడం అంత ఈజీ కాదు: గవాస్కర్

సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం దక్కెనా..?

నాలుగు, ఐదు స్థానాల్లో శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ ఆడనున్నారు. అయితే ఆరో స్థానంలో ఎవర్ని ఆడిస్తారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ స్థానం కోసం సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. స్పిన్‌ను సమర్ధవంతంగా ఆడే సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్‌వైపే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

శ్రీలంకతో తొలి టెస్ట్ భారత తుది జట్టు(అంచనా): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్/ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్/సారాన్ష్ జైన్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.

Story first published: Friday, August 14, 2026, 12:39 [IST]
Other articles published on Aug 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+