Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: మ్యాచ్ విన్నర్ ఔట్.. జింబాబ్వేతో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

జింబాబ్వే పర్యటనలో టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. నేడు(జూలై 25) హరారే వేదికగా జరిగే రెండో టీ20లో ఆతిథ్య జింబాబ్వేతో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి టీ20 తరహాలోనే ఏకపక్ష విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో భారత్ ఉంది.

తద్వారా ఆఖరి మ్యాచ్‌లో బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని భారత్ భావిస్తోంది. మరోవైపు రెండో టీ20లో గెలిచి సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో జింబాబ్వే ఉంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మా అమ్మ కోసం A మార్క్.. రింకూ సింగ్‌ కోసం ఆ సెలెబ్రేషన్: వైభవ్ సూర్యవంశీ

మా అమ్మ కోసం A మార్క్.. రింకూ సింగ్‌ కోసం ఆ సెలెబ్రేషన్: వైభవ్ సూర్యవంశీ

మయాంక్ యాదవ్‌కు రెస్ట్..

తొలి మ్యాచ్‌లో సంచలన బౌలింగ్ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన మయాంక్ యాదవ్‌కు ఈ మ్యాచ్‌ నుంచి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి వచ్చిన మయాంక్ యాదవ్.. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే వికెట్ తీసి ఔరా అనిపించాడు. తన మూడో ఓవర్‌లో మరో వికెట్ పడగొట్టి.. జింబాబ్వే పతనాన్ని శాసించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

India Playing XI For 2nd T20I against Zimbabwe Mayank Yadav Rested Yash Thakur To Debut

మయాంక్ యాదవ్ గాయాల చరిత్ర నేపథ్యంలో వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా రెండో టీ20 నుంచి అతనికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే యువ పేసర్ యశ్ ఠాకూర్‌ అరంగేట్రం చేస్తాడు. అప్పుడు అశోక్ శర్మ, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్ పేస్ బాధ్యతలు పంచుకుంటారు. రవి బిష్ణోయ్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఆడుతాడు.ఈ ఒక్కటి మినహా భారత తుది జట్టులో ఎలాంటి మార్పు జరిగే అవకాశం లేదు. దాంతో సూర్యాన్ష్ షెడ్గే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, హర్ష్ దూబేలకు నిరాశే ఎదురు కానుంది.

ఆ వికెట్‌తో నా భయం పోయింది.. రెండేళ్లు నరకం చూశా: మయాంక్ యాదవ్

ఆ వికెట్‌తో నా భయం పోయింది.. రెండేళ్లు నరకం చూశా: మయాంక్ యాదవ్

వైభవ్‌పైనే అందరి కళ్లు..

టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయనున్నారు. తొలి టీ20లో విధ్వంసకర బ్యాటింగ్‌తో వైభవ్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. అభిషేక్ శర్మ బ్యాట్ ఝులిపించాల్సి ఉంది.

మూడో స్థానంలో ఇషాన్ కిషన్ ఆడనుండగా.. నాలుగో ప్లేస్‌లో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్ చేయనున్నాడు. రింకూ సింగ్ ఫినిషర్‌గా బాధ్యత పోషించనున్నాడు. తొలి టీ20లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.

శివమ్ దూబే ఒక్కడే ఆల్‌రౌండర్ పాత్ర పోషించనున్నాడు. తొలి మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన శివమ్ దూబే 32 పరుగులిచ్చి ఒక వికెట్ తీసాడు. బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. శివమ్ దూబేపై నమ్మకంతో టీమిండియా ఆలో బౌలర్ లేకుండా ఆడుతోంది.

మయాంక్ యాదవ్‌కు రెస్ట్ ఇస్తే.. ప్రిన్స్ యాదవ్ పేస్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. అరంగేట్ర ప్లేసర్లు అశోక్ శర్మ, యశ్ ఠాకూర్‌తో కలిసి అతను పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. జింబాబ్వేతో చివరి రెండు టీ20లు వరుసగా ఉండటంతో మయాంక్ యాదవ్‌కు రెస్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అబ్బర బిడ్డో.. ఇన్నింగ్స్ ఫస్ట్‌ బాల్‌కే వికెట్!గంటకు 150 కిలోమీటర్ల వేగం..!(వీడియో)

అబ్బర బిడ్డో.. ఇన్నింగ్స్ ఫస్ట్‌ బాల్‌కే వికెట్!గంటకు 150 కిలోమీటర్ల వేగం..!(వీడియో)

భారత్‌తో రెండో టీ20 తుది జట్టు(అంచనా)

వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్/యశ్ ఠాకూర్, అశోక్ శర్మ.

Story first published: Saturday, July 25, 2026, 11:33 [IST]
Other articles published on Jul 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+