Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Arjun Tendulkar:అరుదైన రికార్డ్ సాధించిన సచిన్ కొడుకు..!

టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్.. ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు.

తద్వారా వైట్ బాల్ క్రికెట్‌లో అర్జున్ టెండూల్కర్ 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 2021లో ముంబై తరఫున దేశవాళీ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన అర్జున్ టెండూల్కర్ 41 వైట్ బాల్ మ్యాచ్‌ల్లో 51 వికెట్లు పడగొట్టాడు. 17 లిస్ట్ ఏ మ్యాచ్‌లో ఈ లెఫ్టార్మ్ పేసర్ 24 మంది బ్యాటర్లను ఔట్ చేశాడు. 24 టీ20ల్లో 27 వికెట్లు పడగొట్టాడు.

India legend Sachin Tendulkar Son Arjun Tendulkar Achieves Key Career Milestone In Senior Cricket

దేశవాళీ క్రికెట్‌లోకి రాకముందు అర్జున్ టెండూల్కర్ ముంబై తరఫున జూనియర్ లెవెల్ క్రికెట్ ఆడాడు. అండర్ 19 జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. 2022/23 రంజీ సీజన్‌కు ముందు అర్జున్ టెండూల్కర్ ముంబై నుంచి గోవాకు మారాడు. గోవా తరఫునే లిస్ట్-ఏతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అరంగేట్ర ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లోనే అర్జున్ టెండూల్కర్ సెంచరీతో సత్తా చాటాడు.

17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో అర్జున్ టెండూల్కర్ 37 వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీలో ఒకసారి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. అతని తండ్రి సచిన్ టెండూల్కర్ 310 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 71 వికెట్లు పడగొట్టాడు. కానీ ఒక్కసారి కూడా ఐదు వికెట్ల ఘనతను అందుకోలేదు.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ అతని కనీస ధర రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. 2021లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ 2023లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Wednesday, December 25, 2024, 15:58 [IST]
Other articles published on Dec 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+