ముత్యం.. నీ కొడుకు ఓ వజ్రం: సునీల్ గవాస్కర్
టీమిండియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డిని దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ప్రశంసించాడు. 'మీ త్యాగాల వల్లే భారత్‌కు వజ్రం లాంటి క్రికెటర్ దొరికాడు'అని అభినందించాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో నితీష్ కుమార్ రెడ్డి సంచలన బ్యాటింగ్‌తో సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌కు నితీష్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వారి ఫ్యామిలీ చూస్తుండగా నితీష్ ఉత్కంఠ పరిస్థితుల మధ్య కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో నితీష్ కుటుంబం ఆదివారం ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్‌ను కలిసింది.

ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్ కాళ్లను ముత్యాల రెడ్డి మొక్కారు. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. ఆనంద భాష్పాలు రాల్చాడు. సునీల్ గవాస్కర్ సైతం భావోద్వేగానికి గురయ్యాడు. ఓ తండ్రిగా గర్వించదగ్గ క్షణం అంటూ వ్యాఖ్యానించాడు. కొడుకు కోసం ముత్యాలరెడ్డి చేసిన ఎంతో త్యాగం చేశారని, ఉద్యోగాన్ని సైతం వదులుకున్న విషయం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్, భారత జట్టుకు వజ్రంలాంటి ప్లేయర్‌ను ముత్యాలరెడ్డి అందించాడని గవాస్కర్ ప్రశంసించాడు.
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి కూడా నితీష్‌ను కొనియాడాడు. అతని పోరాటం కన్నీళ్లను తెప్పించందని చెప్పాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 221 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత జట్టును నితీష్(189 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 114) సంచలన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. వాషింగ్టన్ సుందర్(160 బంతుల్లో ఒక్క ఫోర్‌తో 50) కలిసి 8వ వికెట్‌కు 127 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా ఔటైనా.. సిరాజ్ సాయంతో సెంచరీ మార్క్ అందుకొని తన కలను సాకారం చేసుకున్నాడు.
కష్టాల్లో భారత్..
ఈ మ్యాచ్ ఉత్కంఠగా మారింది. 340 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 130 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. యశస్వి జైస్వాల్(82 బ్యాటింగ్), వాషింగ్టన్ సుందర్(2 బ్యాటింగ్) టీమిండియాను గట్టెక్కించేందుకు పోరాడుతున్నారు. చేతిలో 4 వికెట్లు ఉండగా.. భారత్ ఇంకా 26 ఓవర్లు ఆడాల్సి ఉంది.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 474 పరుగుల భారీ స్కోర్ చేయగా.. భారత్ 369 పరుగులకు ఆలౌటైంది. 105 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌటైంది.
Nitish Kumar Reddy's family meeting the Great Sunil Gavaskar. [ABC Sport]
— Johns. (@CricCrazyJohns) December 29, 2024
- Beautiful moments at MCG...!!! pic.twitter.com/DEFJpCRSWY
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications