For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

8 నెలలు.. 33 మ్యాచ్‌లు! టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే!

భారత క్రికెట్ చరిత్రలోనే జూన్(28) మరిచిపోలేని రోజుగా మిగిలిపోయింది. 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను సొంతం చేసుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో సమష్టి ప్రదర్శనతో సంచలన విజయాన్నందుకుంది.

దాంతో 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియాకు ఐసీసీ టైటిల్ దక్కింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో అరంగేట్ర టీ20 ప్రపంచకప్ 2007 గెలిచిన టీమిండియా 17 ఏళ్ల తర్వాత రెండో పొట్టి కప్‌ను ముద్దాడింది. టీ20 ప్రపంచకప్ 2024లో విజేతగా నిలిచిన టీమిండియా మరో ఏడాది వరకు బిజీగా గడపనుంది.

India Full Schedule Post T20 WC 2024 win till IPL 2025

టీ20ల్లో నవ శకం..
ఆస్ట్రేలియా పర్యటన నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వంటి కీలక టోర్నీల్లో పాల్గొననుంది. జూలైన 6 నుంచి జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న టీమిండియా.. అనంతరం శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలతో టీ20 ఫార్మాట్‌లో టీమిండియా కొత్త శకం ప్రారంభం కానుంది. ప్రపంచకప్ విజయంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం కూడా ఈ విజయంతోనే ముగియనుంది. ఇప్పటికే కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టిన బీసీసీఐ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. జింబాబ్వే పర్యటనకు ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వెళ్లనుండగా.. శ్రీలంక పర్యటనకు కొత్త కోచ్ బాధ్యతలు స్వీకరించనున్నాడు.

టార్గెట్ ఛాంపియన్స్ ట్రోఫీ..
వచ్చే ఏడాదే ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా పర్యటనతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. బీసీసీఐ సెక్రటరీ జైషా కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వరకు సీనియర్ ఆటగాళ్లు ఆడుతారని తెలిపాడు.

ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు డబ్ల్యూటీసీ టైటిల్ గెలవడమే టీమిండియా తదుపరి లక్ష్యాలుగా పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమిండియా 20 టీ20లు, 10 టెస్ట్‌లు, 6 వన్డేలు ఆడనుంది. 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించనున్నారు. వన్డే ఫార్మాట్‌లోనే ఈ టోర్నీ జరిగే అవకాశం ఉంది. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. పాకిస్థాన్‌కు భారత్ వెళ్తుందా? లేదా? అనేదానిపై సందిగ్దత నెలకొంది.

ఐపీఎల్ 2025 వరకు భారత షెడ్యూల్

జింబాబ్వే పర్యటనలో ఐదు టీ20ల సిరీస్( జూలై 6 నుంచి 14 వరకు )

శ్రీలంక పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్(జూలై/ఆగస్ట్) షెడ్యూల్ ప్రకటించలేదు

భారత్‌కు రానున్న బంగ్లాదేశ్, రెండు టెస్ట్‌లు, 3 టీ20లు, (సెప్టెంబర్/అక్టోబర్)

భారత్‌కు రానున్న న్యూజిలాండ్, మూడు టెస్ట్‌లు(అక్టోబర్, నవంబర్)

సౌతాఫ్రికా పర్యటనకు భారత్, 4 టీ20ల సిరీస్‌(నవంబర్)

ఆస్ట్రేలియా పర్యటనకు భారత్, ఐదు టెస్ట్‌ల సిరీస్(నవంబర్/డిసెంబర్/ జనవరి 2025)

భారత పర్యటనకు ఇంగ్లండ్ మూడు వన్డేలు, 5 టీ20లు(జనవరి/ఫిబ్రవరి 2025)

ఛాంపియన్స్ ట్రోఫీ 2025(ఫిబ్రవరి/మార్చి 2025)

మార్చి చివరి వారం నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం

Story first published: Tuesday, July 2, 2024, 8:27 [IST]
Other articles published on Jul 2, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+