
ముంబై: తన బయోపిక్ చిత్రం కనుక తెరకెక్కిస్తే తన పాత్రలో బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు నటించాలని భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ధోనీ, సచిన్, మేరీకోమ్ బయోపిక్ చిత్రాలు విడుదలై బాక్సాఫిస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. ధోనీ బయోపిక్‌లో సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రధాన పాత్ర షోషించగా.. మేరీ కోమ్‌లో ప్రియాంక చోప్రా నటించింది. ఈ చిత్రాలు బాక్సాఫిస్ వద్ద భారీ విజయం సాధించడంతో మరికొన్ని తెరకెక్కుతున్నాయి. కపిల్ దేవ్, మిథాలీ రాజ్, సైనా నెహ్వాల్ బయోపిక్స్ కూడా రానున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భువీని.. 'మీ బయోపిక్‌లో ఏ హీరో నటించాలనుకున్నారని ప్రశ్నించగా.. ఈ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రాజ్‌కుమర్ రావు పేరు సూచించాడు. 'ఫిజికల్ అప్పియరెన్స్‌లో రాజ్‌కుమార్‌కు నాకు పోలీకలున్నాయని చాలా మంది అంటుంటారు. కాబట్టి నా బయోపిక్ అతను నటిస్తేనే బాగుంటుంది'అని తెలిపాడు.
ఇక భారత్ తరఫున 21 టెస్ట్‌లు, 143 వన్డేలు, 43 టీ20లు ఆడిన భువనేశ్వర్.. 63, 132, 41 వికెట్లు పడగొట్టాడు. ఇక న్యూటన్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజ్‌కుమార్ ప్రస్తుతం... లూడో, రూహి అఫ్‌జానా, చలాంగ్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇక రెండేళ్ల క్రితం వచ్చిన స్త్రీ సినిమా సూపర్ హిట్ అయింది.