For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం!

హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నీలో టీమిండియా శుభారంభం చేసింది. దాయాదీ పాకిస్థాన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ సారథ్యంలోని భారత్ డక్ వర్త్ లూయిస్ పద్దతిన 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్లకు 84 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రాబిన్ ఊతప్ప(11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 28), చిప్లీ(13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24), దినేశ్ కార్తీక్(6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 17 నాటౌట్) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో ముహమ్మద్ షెహ్‌జాద్(2/15) రెండు వికెట్లు తీయగా.. అబ్దుల్ సమద్(1/16) ఒక వికెట్ పడగొట్టాడు.

అనంతరం పాకిస్థాన్ వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 41 పరుగులే చేసింది. ఖవాజా నఫే(9 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 18 నాటౌట్), అబ్దుల్ సమద్(6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 16 నాటౌట్) రాణించగా.. మాజ్ సదకత్(7) విఫలమయ్యాడు. భారత బౌలర్లలో స్టువర్ట్ బిన్నీకి ఒక వికెట్ దక్కింది. వర్షం ఆగకపోవడంతో అంపైర్లు డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఫలితాన్ని తేల్చారు. డీఎల్ఎస్ ప్రకారం పాకిస్థాన్ 2 పరుగుల వెనుకంజలో ఉంది. టీమిండియా తదుపరి మ్యాచ్‌ను కువైట్‌తో శనివారం ఆడనుంది.

India Edge Past Pakistan by 2 Runs in Thrilling Hong Kong Sixes 2025 Clash
Photo Credit: Hong Kong Sixes (X)

ఆరుగురు ప్లేయర్లతోనే ఆట..

హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నీ క్రికెట్‌లో విభిన్నమైన ఫార్మాట్. ఈ ఫార్మాట్‌లో ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. ఒక్కో ఇన్నింగ్స్‌లో 6 ఓవర్ల చొప్పున ఉంటాయి. వికెట్ కీపర్ మినహా ఫీల్డింగ్ జట్టులోని ప్రతీ ఆటగాడు తప్పనిసరిగా ఒక ఓవర్ బౌలింగ్ చేయాలి. ఒక బౌలర్‌కు మాత్రం రెండు ఓవర్లు వేసే అవకాశం ఉంటుంది. బ్యాటింగ్‌లో ఒక బ్యాటర్ 31 పరుగులు చేస్తే రిటైర్డ్ నాటౌట్‌గా వెనుదిరిగాలి. ఆ తర్వాతి బ్యాటర్లు బ్యాటింగ్‌ వస్తారు. అవకాశం వస్తే రిటైర్ అయిన ఆటగాడు మళ్లీ బ్యాటింగ్ చేయవచ్చు.

నిర్ణీత ఓవర్లు పూర్తికాకముందే ఐదు వికెట్లు పడిపోతే.. చివరి బ్యాటర్‌ను రనౌట్‌గా ఉంచుకొని బ్యాటింగ్ చేయవచ్చే. ఆరో వికెట్ కూడా పడితే ఆలౌట్‌గా పరిగణిస్తారు. వైడ్, నోబాల్‌కు రెండు పరుగులు ఇస్తారు. నో బాల్‌కు ఫ్రీ హిట్ కూడా ఉండదు.

టోర్నీ ఫార్మాట్ ఏంటంటే..?

ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు బరిలోకి దిగాయి. ఈ 12 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు. రౌండ్ రాబిన్ పద్దతిలో ప్రతీ గ్రూప్‌లోని జట్టు..ప్రత్యర్థితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్లు సెమీఫైనల్స్, అందులో గెలిచిన టీమ్స్ ఫైనల్ ఆడుతాయి. క్వార్టర్ ఫైనల్స్ ఓడిన జట్లు ప్లేట్ సెమీఫైనల్స్ ఆడుతాయి. అందులో గెలిచిన టీమ్ ప్లేట్ ఫైనల్ ఆడుతాయి. గ్రూప్‌లో చివరి స్థానంలో నిలిచే జట్లు బౌల్ లీగ్ ఆడి.. అగ్రస్థానంలో ఉన్న జట్లు బౌల్ ఫైనల్ చేరుకుంటాయి. ఈ స్పెషల్ ఫార్మాట్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

Story first published: Friday, November 7, 2025, 20:21 [IST]
Other articles published on Nov 7, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+