Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: కుప్పకూలిన సౌతాఫ్రికా.. టీమిండియా ఘన విజయం!

సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. కటక్ వేదికగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 101 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో 74 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(3/31) మూడు వికెట్లు తీయగా.. లుతో సిపమ్లా(2/38) రెండు వికెట్లు పడగొట్టాడు. డోనోవన్ ఫెర్రెరియా ఒక వికెట్ పడగొట్టాడు.

అనంతరం సౌతాఫ్రికా 12.3 ఓవర్లలో 74 పరుగులకు కుప్పకూలింది. డెవాల్డ్ బ్రెవిస్(14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(2/14), జస్‌ప్రీత్ బుమ్రా(2/17), వరుణ్ చక్రవర్తీ(2/19), అక్షర్ పటేల్(2/7) రెండేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే చెరో వికెట్ పడగొట్టారు.

India Crush South Africa by 101 Runs After Bowling Them Out for 74 in 1st T20I

176 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఒక్క పరుగు కూడా చేయకుండానే ఓపెనర్ క్వింటన్ డికాక్(0) డకౌటయ్యాడు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. తన మరుసటి ఓవర్‌లో ట్రిస్టన్ స్టబ్స్(14)‌ను అర్ష్‌దీప్ సింగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి డెవాల్డ్ బ్రెవిస్ రాగా.. కెప్టెన్ మార్క్‌రమ్ ఆచితూచి ఆడాడు. కానీ అక్షర్ పటేల్ తన తొలి బంతికే మార్క్‌రమ్‌(14)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో పవర్ ప్లేలో సౌతాఫ్రికా 3 వికెట్లకు 45 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే డేవిడ్ మిల్లర్(1)ను హార్దిక్ పాండ్యా కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.

ఆ తర్వాత వచ్చిన డోనోవన్ ఫెర్రెరియా(5)ను వరుణ్ చక్రవర్తీ ఔట్ చేయగా.. దూకుడుగా ఆడిన డెవాల్డ్ బ్రెవిస్(22)‌ను జస్‌ప్రీత్ బుమ్రా క్యాచ్ ఔట్ చేశాడు. ఈ వికెట్‌తో టీ20ల్లో 100 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. భారీ సిక్సర్‌ బాదిన మార్కో జాన్సెన్(12)ను మరుసటి బంతికే వరుణ్ చక్రవర్తీ క్లీన్ బౌల్డ్ చేశాడు. అదే ఓవర్‌లో కేశవ్ మహరాజ్(0)ను బుమ్రా క్యాచ్ ఔట్ చేయగా.. అన్రిచ్ నోర్జ్(1)ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. లుతో సిప్లమా(2)ను దూబే ఆఖరి వికెట్‌గా పెవిలియన్ చేర్చడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే సౌతాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోర్.

Story first published: Tuesday, December 9, 2025, 22:24 [IST]
Other articles published on Dec 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+