టీమిండియా చెత్త రికార్డ్ నమోదు చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా అత్యధిక మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయాడు. అంతకుముందు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కలిసి 10 మ్యాచ్‌ల్లో టాస్ ఓడారు. దాంతో వరుసగా 13 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన జట్టుగా భారత్ చెత్త రికార్డ్ నమోదు చేసింది.
ఈ క్రమంలో వెస్టిండీస్ పేరిట ఉన్న 26 ఏళ్ల చెత్త రికార్డ్‌ను అధిగమించింది. 1999లో ఫిబ్రవరి నుంచి ఎప్రిల్ మధ్య వెస్టిండీస్ 12 మ్యాచ్‌ల్లో వరుసగా టాస్ ఓడింది. ఈ జాబితాలో ఇంగ్లండ్.. మూడో స్థానంలో నిలిచింది. డిసెంబర్ 2022 నుంచి మార్చి 2023 మధ్య ఇంగ్లండ్ వరుసగా 11 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయింది. భారత్ ఈ ఏడాది జనవరి నుంచి తాజా మ్యాచ్ వరకు వరుసగా 13 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో టాస్ ఓడింది. ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ చివరి రెండు టీ20ల్లో టాస్ ఓడిపోయాడు.

ఆ తర్వాత రోహిత్ శర్మ వరుసగా 8 వన్డేల్లో టాస్ ఓడిపోయాడు. అయితే టాస్ ఓడిన గత 12 మ్యాచ్‌ల్లో టీమిండియా 11 గెలవడం గమనార్హం. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మాత్రమే టీమిండియా ఓటమిపాలైంది. గతంలో రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా వరుసగా 15 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయింది. రోహిత్ శర్మ సారథ్యంలో 13 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన టీమిండియా.. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో రెండు మ్యాచ్‌లు ఓటమిపాలైంది.
ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌లో టీమిండియా టాస్ ఓడి ఫీల్డింగ్‌కు దిగింది. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ధాటికి ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ(18), బెన్ డకెట్(23) విఫలమైనా.. ఓలీ పోప్, జో రూట్ నిలకడగా ఆడుతున్నారు. 102 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తైంది.