For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: ఓవల్ విజయంతో చరిత్ర సృష్టించిన భారత్!

టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతి తక్కువ పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో 21 ఏళ్ల రికార్డ్‌ను టీమిండియా తిరిగరాసింది. ఇంగ్లండ్‌తో సోమవారం ముగిసిన ఆఖరి టెస్ట్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా టీమిండియా ఈ ఫీట్ సాధించింది. 339/6 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌.. 367 పరుగులకు ఆలౌటైంది. మహమ్మద్ సిరాజ్(5/104) ఐదు వికెట్లతో భారత్‌కు చిరస్మరణీయమైన వియాజయాన్నందించాడు. సిరాజ్‌తో పాటు ప్రసిధ్ కృష్ణ(4/126) నాలుగు వికెట్లు తీయగా ఆకాష్ దీప్ ఓ వికెట్ పడగొట్టాడు.

ఆఖరి రోజు భారత బౌలర్లు సిరాజ్, ప్రసిధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేసి 35 పరుగుల డిఫెండ్ చేశారు. ఈ గెలుపుతో టీమిండియా నయా రికార్డ్‌ను తమ పేరిట లిఖించుకుంది. 2004లో టీమిండియా వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 13 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇదే ఇప్పటి వరకు టీమిండియా సాధించిన లోయెస్ట్ మార్జిన్ విజయం. అంతకుముందు 1972లో కోల్‌కతా వేదికగా 28 పరుగులతో, 2018లో ఆస్ట్రేలియాపై 31 పరుగులతో టీమిండియా గెలుపొందింది.

India Creates History with Lowest Ever Test Win Margin Rewrites 21-Year Record with Nail-Biting 6-Run Victory Over England

విదేశాల్లో జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ గెలవడం టీమిండియాకు ఇదే తొలిసారి. ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా మహమ్మద్ సిరాజ్.. జస్‌ప్రీత్ బుమ్రాను సమం చేశాడు. 2021-22 పర్యటనలో బుమ్రా 23 వికెట్లు తీయగా.. తాజా పర్యటనలో సిరాజ్ 23 వికెట్లు పడగొట్టాడు.

ఇంగ్లండ్‌లో ఒక టెస్ట్ సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు

23 - జస్ప్రీత్ బుమ్రా, 2021-22

23 - మహ్మద్ సిరాజ్, 2025*

19 - భువనేశ్వర్ కుమార్, 2014


భారత్‌కు అతి తక్కువ తేడాతో దక్కిన విజయాలు (పరుగుల ప్రకారం)

6 vs ఇంగ్లండ్, ది ఓవల్, 2025*

13 vs ఆస్ట్రేలియా, వాంఖెడే, 2004

28 vs ఇంగ్లండ్, కోల్‌కతా, 1972

31 vs ఆస్ట్రేలియా, అడిలైడ్, 2018

ఇంగ్లండ్‌కు అతి తక్కువ తేడాతో ఎదురైన ఓటములు (పరుగుల ప్రకారం)

1 vs న్యూజిలాండ్, వెల్లింగ్టన్, 2023

3 vs ఆస్ట్రేలియా, మాంచెస్టర్, 1902

6 vs ఆస్ట్రేలియా, సిడ్నీ, 1885

6 vs భారత్, ది ఓవల్, 2025*

Story first published: Monday, August 4, 2025, 22:58 [IST]
Other articles published on Aug 4, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+