For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 23 సిక్సర్లతో వరల్డ్ రికార్డ్!

అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన తమ పాత రికార్డ్‌ను సమం చేసింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో తిరువనంతపురం వేదికగా శనివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. 23 సిక్సర్లతో పాటు 17 ఫోర్లు బాది న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు.

ఇషాన్ కిషన్(43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్‌లతో 103) విధ్వంసకర శతకంతో చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 271 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. హార్దిక్ పాండ్యా(17 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 42), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) మెరుపులు మెరిపించారు. భారత బ్యాటర్ల ధాటికి న్యూజిలాండ్ బౌలర్లు ధారళంగా పరుగులిచ్చుకున్నారు. జాకోబ్ డఫీ(1/53), కైల్ జెమీసన్(1/59), మిచెల్ సాంట్నర్(1/60) హాఫ్ సెంచరీలు సమర్పించుకోగా. లాకీ ఫెర్గూసన్(2/41) కాస్త కట్టడిగా బౌలింగ్ చేశాడు.

India Creates History Equals World Record with 23 Sixes in Final T20I vs New Zealand

రెండో సారి 23 సిక్సర్లు..

ఇషాన్ కిషన్ 10, సూర్యకుమార్ యాదవ్ 6, హార్దిక్ పాండ్యా 4, అభిషేక్ శర్మ రెండు సిక్స్‌లతో పాటు ఆఖరి బంతికి శివమ్ దూబే సిక్స్ కొట్టడంతో ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 23 సిక్స్‌లు నమోదయ్యాయి. అంతర్జాతీయ టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డ్ ఇప్పటికే భారత జట్టుపై ఉంది. 2024 నవంబర్‌లో జోహన్నెబర్గ్‌లో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ 23 సిక్సర్లు బాదింది. అప్పడు తిలక్ వర్మ 10, సంజూ శాంసన్ 9, అభిషేక్ శర్మ 4 సిక్స్‌లు బాదారు. తాజాగా ఈ రికార్డ్‌ను భారత్ మరోసారి అందుకుంది.

5 మ్యాచ్‌ల్లో 69 సిక్స్‌లు..

ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన జట్టుగా కూడా భారత్‌ నిలిచింది. తాజా సిరీస్‌లో భారత్ ఐదు మ్యాచ్‌ల్లో కలిపి 69 సిక్స్‌లు బాదింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ పేరిట ఉన్న 64 సిక్స్‌ల రికార్డ్‌ను అధిగమించింది. 2023లో వెస్టిండీస్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ 64 సిక్స్‌లు బాదింది. గతేడాది వెస్టిండీస్‌తో ఆస్ట్రేలియా కూడా 64 సిక్స్‌లు బాదగా.. ఇండోనేషియాపై కంబోడియా 62 సిక్స్‌లతో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. టెస్ట్ హోదా కలిగిన జట్లలో ఇది ఐదో అత్యధిక స్కోర్‌గా నిలిచింది. ఈ జాబితాలో 304/2 స్కోర్‌తో ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉండగా 297/6 స్కోర్‌తో భారత్ రెండో స్థానంలో నిలిచింది.

ఫుల్ మెంబర్ జట్లపై అత్యధిక టీ20 స్కోర్లు:

304/2 - ఇంగ్లండ్ vs సౌతాఫ్రికా, మాంచెస్టర్ (2025)

297/6 - భారత్ vs బంగ్లాదేశ్, హైదరాబాద్ (2024)

283/1 - భారత్ vs సౌతాఫ్రికా, జోహన్నెస్‌బర్గ్ (2024)

278/3 - ఆఫ్ఘనిస్తాన్ vs ఐర్లాండ్, డెహ్రాడూన్ (2019)

271/5 - భారత్ vs న్యూజిలాండ్, తిరువనంతపురం (2026)*

ఈ సిరీస్‌లో స్పిన్నర్లపై భారత్ ప్రదర్శన:

ఓవర్లు: 34

పరుగులు: 415

వికెట్లు: 10

సగటు (Avg): 41.50

స్ట్రైక్ రేట్ (SR): 203.43

ఫోర్లు/సిక్సర్లు: 39/26

ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో ఒక జట్టు బాదిన అత్యధిక సిక్సర్లు:

69 - భారత్ vs న్యూజిలాండ్, 2026 (5 టీ20లు)

64 - ఇంగ్లాండ్ vs వెస్టిండీస్, 2023 (5)

64 - ఆస్ట్రేలియా vs వెస్టిండీస్, 2025 (5)

62 - కాంబోడియా vs ఇండోనేషియా, 2025 (8)

Story first published: Saturday, January 31, 2026, 21:23 [IST]
Other articles published on Jan 31, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+