Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: చరిత్ర సృష్టించిన టీమిండియా.. తొలి జట్టుగా..!

టీ20 ఫార్మాట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా చరిత్రకెక్కింది. జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా బుధవారం జరిగిన మూడో టీ20లో సమష్టిగా రాణించి 23 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. టీ20ల్లో టీమిండియాకు ఇది 150వ విజయం. పొట్టి ఫార్మాట్‌లో 150 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది.

India Create History With Win

జింబాబ్వేతో మూడో టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో రాణించగా.. రుతురాజ్ గైక్వాడ్(28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబని(2/25), సికందర్ రాజా(2/24) రెండేసి వికెట్లు తీసారు. అనంతరం జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసి ఓటమిపాలైంది. డియోన్ మైర్స్(49 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 65 నాటౌట్), క్లైవ్ మదండే(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(3/15) వికెట్లు తీయగా..ఆవేశ్ ఖాన్(2/22) రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్(1/15) ఓ వికెట్ తీసాడు. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటి వరకు 230 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. 150 మ్యాచ్‌ల్లో గెలుపొంది అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. భారత్ తర్వాత పాకిస్థాన్ 142 విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లు:

భారత్-230 మ్యాచ్‌ల్లో 150 విజయాలు

పాకిస్థాన్-245 మ్యాచ్‌ల్లో 142 విజయాలు

న్యూజిలాండ్-220 మ్యాచ్‌ల్లో 111 విజయాలు

ఆస్ట్రేలియా-195 మ్యాచ్‌ల్లో 105 విజయాలు

సౌతాఫ్రికా-185 మ్యాచ్‌లో 104 విజయాలు

Story first published: Wednesday, July 10, 2024, 23:22 [IST]
Other articles published on Jul 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+