Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పసికూన చేతిలో భారత్‌కు ఘోర పరాజయం.. టోర్నీ నుంచి ఔట్!

హాంగ్ కాంగ్ ఇంటర్నేషనల్ సిక్సెస్ టోర్నీలో భారత్‌కు బిగ్ షాక్ తగిలిపింది. గ్రూప్-సీలో భాగంగా పసికూన కువైట్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 27 పరుగుల తేడాతో చిత్తయ్యింది. కువైట్ కెప్టెన్ యాసిన్ పటేల్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ పతనాన్ని శాసించాడు.

కువైట్ ఆల్‌రౌండ్ షో..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కువైట్ నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. కెప్టెన్ యాసిన్ పటేల్(14 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 58 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. బిలాల్ తాహీర్(9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 25) రాణించాడు. భారత బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ, నదీమ్, దినేశ్ కార్తీక్ ఒక్కో వికెట్ తీయగా.. మిథున్ రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం భారత్ 5.4 ఓవర్లలో 79 పరుగులకు ఆలౌటైంది. ప్రియాంక్ పాంచల్(10 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 17), అభిమన్యు మిథున్(9 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 26), షెహ్‌బాజ్ నదీమ్(8 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 19) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఓపెనర్ రాబిన్ ఊతప్ప(0) డకౌట్ కాగా.. కెప్టెన్ దినేశ్ కార్తీక్(8), స్టువర్ట్ బిన్నీ(2) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

India Crash Out of Hong Kong Sixes After Consecutive Losses to Kuwait and UAE

టోర్నీ నుంచి భారత్ ఔట్..

కువైట్ బౌలర్లలో కెప్టెన్ యాసిన్ పటేల్(3/23) మూడు వికెట్లు తీయగా.. బిలాల్ తాహీర్, అడ్నాన్ ఇడ్రీస్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. పూల్-సీలోని మిగతా జట్లు కువైట్, పాకిస్థాన్ తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాయి. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే భారత్ గెలిచింది. మిగతా రెండు జట్లు కూడా ఒక్కో మ్యాచ్ గెలిచినప్పటికీ మెరుగైన రన్‌రేట్‌తో ముందడుగు వేసాయి. కువైట్ చేతిలో ఎదురైన ఘోర ఓటమి టీమిండియా రన్‌రేట్‌ను దెబ్బతీసింది.

యూఏఈతోనూ ఓటమి..

శనివారమే యూఏఈతో జరిగిన బౌల్ మ్యాచ్‌లోనూ భారత్‌ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 6 ఓవర్లలో 3 వికెట్లకు 107 పరుగులు చేసింది. చిప్లి(4), పాంచల్(0), బిన్నీ(0) విఫలమైనా.. మిథున్(16 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50 నాటౌట్), కెప్టెన్ దినేశ్ కార్తీ(14 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 42) సత్తా చాటారు. అనంతరం యూఏఈ 5.5 ఓవర్లలో 2 వికెట్లకు 111 పరుగులు చేసి గెలుపొందింది. దాంతో ఈ టోర్నీలో భారత్ కథ ముగిసింది.

ఆరుగురు ప్లేయర్లతోనే ఆట..

హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నీ క్రికెట్‌లో విభిన్నమైన ఫార్మాట్. ఈ ఫార్మాట్‌లో ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. ఒక్కో ఇన్నింగ్స్‌లో 6 ఓవర్ల చొప్పున ఉంటాయి. వికెట్ కీపర్ మినహా ఫీల్డింగ్ జట్టులోని ప్రతీ ఆటగాడు తప్పనిసరిగా ఒక ఓవర్ బౌలింగ్ చేయాలి. ఒక బౌలర్‌కు మాత్రం రెండు ఓవర్లు వేసే అవకాశం ఉంటుంది. బ్యాటింగ్‌లో ఒక బ్యాటర్ 31 పరుగులు చేస్తే రిటైర్డ్ నాటౌట్‌గా వెనుదిరిగాలి. ఆ తర్వాతి బ్యాటర్లు బ్యాటింగ్‌ వస్తారు. అవకాశం వస్తే రిటైర్ అయిన ఆటగాడు మళ్లీ బ్యాటింగ్ చేయవచ్చు.

నిర్ణీత ఓవర్లు పూర్తికాకముందే ఐదు వికెట్లు పడిపోతే.. చివరి బ్యాటర్‌ను రనౌట్‌గా ఉంచుకొని బ్యాటింగ్ చేయవచ్చు. ఆరో వికెట్ కూడా పడితే ఆలౌట్‌గా పరిగణిస్తారు. వైడ్, నోబాల్‌కు రెండు పరుగులు ఇస్తారు. నో బాల్‌కు ఫ్రీ హిట్ కూడా ఉండదు.

టోర్నీ ఫార్మాట్ ఏంటంటే..?

ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు బరిలోకి దిగాయి. ఈ 12 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు. రౌండ్ రాబిన్ పద్దతిలో ప్రతీ గ్రూప్‌లోని జట్టు..ప్రత్యర్థితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్లు సెమీఫైనల్స్, అందులో గెలిచిన టీమ్స్ ఫైనల్ ఆడుతాయి. క్వార్టర్ ఫైనల్స్ ఓడిన జట్లు ప్లేట్ సెమీఫైనల్స్ ఆడుతాయి. అందులో గెలిచిన టీమ్ ప్లేట్ ఫైనల్ ఆడుతాయి. గ్రూప్‌లో చివరి స్థానంలో నిలిచే జట్లు బౌల్ లీగ్ ఆడి.. అగ్రస్థానంలో ఉన్న జట్లు బౌల్ ఫైనల్ చేరుకుంటాయి. ఈ స్పెషల్ ఫార్మాట్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

Story first published: Saturday, November 8, 2025, 9:57 [IST]
Other articles published on Nov 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+