For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs BAN మూడో టీ20.. సంజూ శాంసన్ ఔట్.. తిలక్ వర్మ ఇన్: టీమిండియా కోచ్

ఇప్పటికే బంగ్లాదేశ్‌తో మూడో టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న టీమిండియా.. ఆఖరి పోరుకు సిద్దమైంది. హైదరాబాద్ వేదికగా శనివారం జరిగే ఈ మ్యాచ్‌లో పర్యాటక బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి 3-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా భావిస్తుంటే.. ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని బంగ్లాదేశ్‌ అనుకుంటోంది.

ఇప్పటికే టీమిండియా సిరీస్ కైవసం చేసుకోవడంతో తమ కాంబినేషన్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది. తొలి రెండు టీ20ల్లో అవకాశం అందుకోని ప్లేయర్లకు తుది జట్టులో చోటు కల్పించనుంది. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌పై వేటుపడనుంది. అతని స్థానంలో యువ వికెట్ కీపర్ జితేశ్ శర్మకు అవకాశం దక్కనుంది. తొలి రెండు టీ20ల్లో సంజూ శాంసన్ 29, 10 ఆకట్టుకోలేకపోయాడు. బంగారం లాంటి అవకాశాలను చేజార్చుకున్నాడు.

India Coach Makes Big Reveal On Playing XI for 3rd T20I against Bangladesh Will Sanju Samson Be Dropped

శ్రీలంక పర్యటనలోనూ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన సంజూ శాంసన్.. తాజా సిరీస్‌లోనూ అదే వైఫల్యాన్ని కొనసాగించాడు. జితేశ్ శర్మతో పాటు తెలుగు తేజం తిలక్ వర్మ‌కు కూడా భారత తుది జట్టులో చోటు దక్కనుంది. యువ పేసర్ హర్షిత్ రాణా కూడా అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ తుది జట్టు మార్పులపై స్పందించాడు.

'తిలక్ వర్మ తుది జట్టులోకి రానున్నాడు. జితేశ్ శర్మకు కూడా అవకాశం దక్కనుంది. అయితే సంజూ శాంసన్‌కు మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. ఆ ఆప్షన్స్ గురించి పరిశీలిస్తున్నాం. కుర్రాళ్లందరికి అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం వచ్చేలా ప్రయత్నిస్తున్నాం. హర్షిత్ రాణా వంటి కుర్రాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. ముందుగా సిరీస్ గెలవడం మా ప్లాన్. ఆ తర్వాత చివరి మ్యాచ్‌లో కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలనుకున్నాం.

సంజూ శాంసన్ భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా.. టీమ్ ప్రణాళికలకు తగ్గట్లు దూకుడుగా ఆడాడు. గ్వాలియర్‌లో భారత్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించాడు. ఆచితూచి ఆడుతూ 50-60 చేయడం అతనికి సులువే. కానీ అతను భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. గేమ్ పరిస్థితి అతనికి బాగా తెలుసు. టీమ్ మేనేజ్‌మెంట్‌ సందేశంపై స్పష్టత ఉంది.

జట్టు కోసం చేయాల్సినవన్నీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. స్వేచ్చగా ఆడేలా కుర్రాళ్లను తీర్చిదిద్దుతున్నాం.'అని ర్యాన్ టెన్ చెప్పుకొచ్చాడు.

9 ఏళ్ల క్రితం టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సంజూ శాంసన్.. తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. ఇప్పటి వరకు 32 మ్యాచ్‌లు ఆడి 19.32 సగటుతో 483 పరుగులే చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Story first published: Friday, October 11, 2024, 21:25 [IST]
Other articles published on Oct 11, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+