Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ లావుగా ఉన్నా.. కోహ్లీ కంటే ఫిట్‌గా ఉంటాడు: టీమిండియా కోచ్

రోహిత్ శర్మ చూడటానికి లావుగా కనిపిస్తున్నా.. విరాట్ కోహ్లీ కంటే ఫిట్‌గా ఉంటాడని టీమిండియా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అంకిత్ కలియార్ అన్నాడు. మైదానంలో చాలా చురుకుగా కదులుతాడని, యో-యో టెస్ట్‌లోనూ టాప్ ప్లేస్‌లోనే నిలుస్తాడని చెప్పుకొచ్చాడు. ఇక ఫిట్‌‌నెస్ ఫ్రీక్‌గా మారిన విరాట్ కోహ్లీ.. జట్టులో కొత్త సంప్రదాయానికి తెరలేపిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం భారత ఆటగాళ్లంతా ఫిట్‌గా కనిపిస్తున్నారంటే.. అది కోహ్లీ కెప్టెన్సీ క్రెడిట్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన సారథ్యంలో ఫిట్‌నెస్‌నే తొలి ప్రమాణికంగా తీసుకున్నాడు. ముందుగా తాను మారి ఇతర ఆటగాళ్లకు ఉదాహరణగా నిలిచాడు.

 India coach Ankit Kaliyar says ‘Rohit Sharma may look bulky, but is as fit as Virat Kohli’

యో-యో టెస్ట్‌తో పాటు ఆటగాళ్ల జిమ్‌ టైమ్‌ను పెంచి ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా మార్చాడు. దాంతో ఈ తరం కుర్రాళ్లంతా ఫిట్‌నెస్ విషయంలో విరాట్ కోహ్లీని అనుసరిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతున్న కోహ్లీ.. ఏ రోజు కూడా గాయంతో జట్టుకు దూరం కాలేదు. అంతలా తన ఫిట్‌నెస్‌ను మెయింటేన్ చేస్తున్నాడు.

తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అంకిత్ కలియార్.. విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. అలాగే రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

లావుగా ఉన్నా చిరుతలా...
'రోహిత్ శర్మ కూడా ఫిట్‌ ప్లేయరే. అతనికి మంచి ఫిట్‌నెస్ ఉంది. చూడటానికి కాస్త లావుగా కనిపించినా చాలా అలవోకగా యో- యో టెస్ట్ పాసవుతాడు. ఏ రోజు కూడా యోయో టెస్ట్‌లో అతను విఫలమైంది లేదు. విరాట్ కోహ్లీలానే ఫిట్‌గా ఉంటాడు. కాస్త లావుగా కనిపిస్తున్నా.. మైదానంలో చిరుతలా కదులుతాడు. ఫిట్టెస్ట్ క్రికెటర్లలో అతను కూడా ఒకడు.

ఫిట్‌నెస్ విషయంలో విరాట్ ఒక ఉదాహరణగా నిలిచాడు. జట్టులోకి ఫిట్‌నెస్ సంసృృతిని తీసుకొచ్చాడు. ఓ టాప్ ప్లేయర్ ఫిట్‌గా ఉంటే ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాడు. ఇతరుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడు. కోహ్లీ సారథిగా ఉన్నప్పుడూ అందరూ ఫిట్‌గా ఉండేలా చూసుకున్నాడు. ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు. టీమ్ ఎంపికకు ఫిట్‌నెస్‌నే ప్రమాణికంగా తీసుకున్నాడు.

ఫిట్‌నెస్ సంస్కృతిని..
కెప్టెన్‌గా జట్టులో ఫిట్‌నెస్ సంస్కృతిని, క్షమశిక్షణను తీసుకొచ్చాడు. జట్టులో మంచి వాతావరణాన్ని సృష్టించాడు. భారత ఆటగాళ్లందరూ ఫిట్‌గా ఉండటానికి కారణం అతనే. ఫిట్‌నెస్‌పై అతని అంకితభావం భారత క్రికెట్‌లో తరువాతి తరానికి ఆదర్శంగా నిలిచింది. శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లు ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా చేసింది.

శుభ్‌మన్ అత్యంత ఫిట్ ప్లేయర్. ఫిట్‌నెసే కాదు నైపుణ్యం పరంగానూ అతను గొప్ప ఆటగాడు. విరాట్ కోహ్లీ నుంచి శుభ్‌మన్ గిల్ స్పూర్తి పొందాడని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. బ్యాటింగ్, ఫిట్‌నెస్, స్కిల్ ఏదైనా శుభ్‌మన్.. విరాట్ కోహ్లీని అనుసరిస్తాడు. భవిష్యత్తులో టీమిండియా తరఫున శుభ్‌మన్ అద్భుతాలు చేస్తాడు.'అని అంకిత్ కలియార్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, December 11, 2023, 13:58 [IST]
Other articles published on Dec 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+