Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: డ్రాగా ముగిసిన అహ్మదాబాద్ టెస్ట్.. సిరీస్ భారత్ కైవసం!

 India clinch series 2-1 after Virat Kohli, Shubman Gill centuries help hosts draw Ahmedabad Test

అహ్మదాబాద్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ ఫలితం తేలకుండా ముగియడంతో నాలుగు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2-1తో రోహిత్ సేన వశమైంది. టీమిండియాకు ఇది వరుసగా నాలుగో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజయం కావడం గమనార్హం. 2017, 2018-19, 2020-21, 2023 సిరీస్‌లను భారత్ వరుసగా గెలుచుకుంది. 2013 నుంచి సొంతగడ్డపై ఒక్క టెస్ట్ సిరీస్‌లోనూ టీమిండియా ఓటమిపాలవ్వలేదు. ఆడిన 16 సిరీస్‌లను సొంతం చేసుకుంది.

 కెప్టెన్ల అంగీకారంతో..

కెప్టెన్ల అంగీకారంతో..

ఓవర్‌నైట్ స్కోరు 3/0‌తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా...175/2 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. భారత్‌పై 84 పరుగుల ఆధిక్యం సాధించింది. నైట్‌వాచ్‌మెన్‌గా వచ్చిన మాథ్యూ కుహ్నేమన్ 6 పరుగులు చేసి ఔటవ్వగా.. ట్రావిస్ హెడ్ (163 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 90) అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ సిరీస్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన మార్నస్ లబుషేన్( 213 బంతుల్లో 7 ఫోర్లతో 63 నాటౌట్) ఎట్టకేలకు హాఫ్ సెంచరీ సాధించాడు. స్టీవ్ స్మిత్ (59 బంతుల్లో 2 ఫోర్లతో 10 నాటౌట్) అజేయంగా నిలిచాడు. మ్యాచ్ ఫలితం తేలే పరిస్థితులు లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.

పుజారాతో బౌలింగ్..

పుజారాతో బౌలింగ్..

పిచ్ నుంచి బౌలర్లకు ఎలాంటి సహకారం లేకపోవడంతో రోహిత్ శర్మ.. శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారాలతో బౌలింగ్ చేయించాడు. 79వ ఓవర్‌లో శు‌భ్‌మన్ గిల్ ఒక బంతి వేసిన తర్వాత రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్‌తో మాట్లాడి డ్రాకు ఒప్పించడంతో మ్యాచ్‌ ముగిసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 480 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (180), కామెరూన్ గ్రీన్ (114) సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ( 186), శుభ్‌మన్ గిల్(128) సెంచరీలు నమోదు చేశారు.

రోహిత్‌కు తొలి డ్రా..

రోహిత్‌కు తొలి డ్రా..

కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇదే తొలి డ్రా. కెరీర్‌లో 6 టెస్ట్‌ మ్యాచ్‌లకు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహారించాడు. తొలి నాలుగు టెస్టుల్లో విజయాలు అందుకున్న రోహిత్.. ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో తొలి పరాజయాన్ని చవి చూశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1తో కైవసం చేసుకోవడంతో పాటు న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓడిపోవడంతో భారత్.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన తర్వాత.. ఆస్ట్రేలియా‌తో ఇంగ్లండ్‌లోని ది ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనుంది.

Story first published: Monday, March 13, 2023, 16:16 [IST]
Other articles published on Mar 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+