Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: టాస్ గెలిచిన భారత్.. SRH ప్లేయర్‌కు నో ఛాన్స్! అశోక్ శర్మ అరంగేట్రం!

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ గురించి తెలుసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఈ మ్యాచ్‌తో అశోక్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

Shreyas Iyer: శ్రేయస్ భాయ్‌.. కత్తి వేలాడుతోంది!

Shreyas Iyer: శ్రేయస్ భాయ్‌.. కత్తి వేలాడుతోంది!

బౌన్స్ ఉండొచ్చు..

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇక్కడ నేను ఆడటం ఇదే తొలిసారి. పిచ్ ఎలా స్పందిస్తుందో నాకు తెలియదు. ప్రాక్టీస్‌తో పాటు పక్కన వికెట్లపై మాత్రం మంచి బౌన్స్ కనిపించింది. కాబట్టి ఇది ఒక కీలకాంశం కానుంది. బౌన్స్ ఉంటుందా? లేదా? అని కచ్చితంగా చెప్పలేను. కానీ ఉంటుందని భావిస్తున్నాను.

IND vs ZIM 1st T20I India Choose to Bowl First as Ashok Sharma Earns Debut Cap No Spot for Harsh Dubey

జింబాబ్వే గత రెండేళ్లుగా మెరుగైన ప్రదర్శన చేస్తుంది. ముఖ్యంగా ప్రపంచకప్‌లో వారు ఆడిన తీరు అద్భుతం. వారి బ్యాటర్లు, బౌలర్లు తమ బలాలను గొప్పగా ప్రదర్శించారు. మేం ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ హర్ష్‌దూబేకు అవకాశం దక్కలేదు. టీమిండియా ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో బరిలోకి దిగడంతో అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు.

అవి నరం లేని నాలుకలు.. పట్టించుకోవద్దు: శ్రేయస్ అయ్యర్

అవి నరం లేని నాలుకలు.. పట్టించుకోవద్దు: శ్రేయస్ అయ్యర్

బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్..

మరోవైపు ఇది సాధారణ హరారే వికెట్ కాదని జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా తెలిపాడు. 'ఆరంభంలో కాస్త బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కానీ అది ఎక్కువ సేపు ఉండదు. ఈ వికెట్‌పై భారీ స్కోర్లు నమోదవుతాయని భావిస్తున్నా. భారీ లక్ష్యాన్ని బోర్డుపై ఉంచగలమని ఆశిస్తున్నా. బంగ్లాదేశ్‌తో తమ టీ20 సిరీస్‌లో చాలా సానుకూల అంశాలు లభించాయి. ఈ సిరీస్‌లో ఓడినా.. ఒత్తిడిలో మా ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు.

ముఖ్యంగా మా బౌలింగ్ విభాగం నిలదొక్కుకున్న తీరు అమోఘం. స్లో వికెట్లపై కూడా మా టాప్-3 బ్యాటర్లు పరుగులు చేశారు. లోయరార్డర్, మిడిలార్డర్ చెలరేగితే మేం ఆశించిన ఫలితం దక్కుతుంది. బౌలింగ్ విభాగం కూడా ఆధిపత్యం కొనసాగిస్తుందని ఆశిస్తున్నా. ఈ మ్యాచ్ హోరాహోరీగా ఉంటుందని నమ్ముతున్నాను. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగుతున్నాం. మా జట్టు తరఫున న్యామురి, బెన్ కర్రన్‌లు అరంగేట్రం చేస్తున్నారు.'అని సికిందర్ రాజా చెప్పుకొచ్చాడు.

భారత్‌ను ఓడిస్తాం.. వైభవ్‌పై విమర్శలు సరికాదు: జింబాబ్వే కెప్టెన్

భారత్‌ను ఓడిస్తాం.. వైభవ్‌పై విమర్శలు సరికాదు: జింబాబ్వే కెప్టెన్

తుది జట్లు:

భారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్.

జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి(కీపర్), బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(సి), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్‌హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ.

Story first published: Thursday, July 23, 2026, 16:38 [IST]
Other articles published on Jul 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+