Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'టీమిండియాలో ఇద్దరు కీపర్లు అవసరమా?'

India cannot have two wicketkeepers in the team: Dilip Vengsarkar

హైదరాబాద్: టీమిండియా ఎంపిక పట్ల మాజీ క్రికెటర్లతో పాటు మాజీ సెలక్టర్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల పుణె వేదికగా జరిగిన భారత్-వెస్టిండీస్ మూడో వన్డేలో 43పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. దీంతో భారత తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లకి టీమిండియా మేనేజ్‌మెంట్ చోటివ్వడాన్ని మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ తప్పుబట్టాడు.

ధోనీని కీపర్‌గా, పంత్‌ని బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే

ధోనీని కీపర్‌గా, పంత్‌ని బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే

వెస్టిండీస్‌తో తాజాగా జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో మహేంద్రసింగ్ ధోని, రిషబ్ పంత్‌కి వరుసగా మేనేజ్‌మెంట్ తుది జట్టులో అవకాశాలిస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఇద్దరినీ జట్టులోకి తీసుకోవడంపై గతంలో కోహ్లీ ఇలా స్పందించాడు. ‘ధోనీని రెగ్యులర్ వికెట్ కీపర్‌గా, రిషబ్ పంత్‌ని కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే తుది జట్టులోకి తీసుకున్నట్లు'స్పష్టం చేశాడు.

ఫామ్‌ను దక్కించుకునేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోన్న ధోనీ

మూడు వన్డేల్లోనూ సంయుక్తంగా విఫలమైన ధోనీ, పంత్

మూడు వన్డేల్లోనూ సంయుక్తంగా విఫలమైన ధోనీ, పంత్

కానీ.. వెస్టిండీస్‌తో ముగిసిన మూడు వన్డేల్లోనూ ధోనీ, పంత్ సంయుక్తంగా విఫలమయ్యారు. దీంతో.. విమర్శలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ధోనీ చివరిగా ఆడిన ఏడు వన్డేల స్కోరుని ఓ సారి పరిశీలిస్తే.. వరుసగా 42, 0, 33, 8, 36, 20, 7 పరుగులు మాత్రమే చేశాడు. వెస్టిండీస్‌పై రెండు వన్డేల్లో మాత్రమే ధోనికి బ్యాటింగ్ చేసేందుకు అవకాశం వచ్చిన విషయం తెలిసిందే.

ఇద్దరు వికెట్ కీపర్లు అవసరం లేదు!

ఇద్దరు వికెట్ కీపర్లు అవసరం లేదు!

‘భారత జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు అవసరం లేదు. తుది జట్టు ఎంపిక తీరు స్థాయికి తగినట్లుగా లేదని నాకు అనిపిస్తోంది. వాస్తవమే.. భారత గొప్ప క్రికెటర్లలో ధోనీ ఒక్కడు.. ఫిట్‌నెస్‌లోనూ తనకి సాటిలేరని నిరూపించుకుంటున్నాడు. కానీ.. కొంతకాలంగా అతని ఫామ్‌ ఆశాజనకంగా లేదు. టెస్టులకి రిటైర్మెంట్, దేశవాళీ క్రికెట్‌ ఆడకపోవడంతో.. కేవలం వన్డే, టీ20ల్లో మాత్రమే ఆడుతూ అతను ఫామ్‌ని కొనసాగించడం కష్టం'అని దిలీప్ వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డారు.

 వన్డేల్లోనూ ధోనీ కెరీర్‌పై దృష్టి సారించాలని

వన్డేల్లోనూ ధోనీ కెరీర్‌పై దృష్టి సారించాలని

మరోవైపు ధోనీపై ఇటీవల టీ20ల్లో వేటు వేసిన సెలక్టర్లు.. వన్డేల్లోనూ అతని కెరీర్‌పై దృష్టి సారించాలని వెంగ్‌సర్కార్ సూచించాడు. (ముంబై) వేదికగా బ్రబౌర్న్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య నాలుగో వన్డే జరగనుంది. సిరీస్‌లో మరో రెండు వన్డేలు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో టీమిండియా ట్రోఫీ దక్కించుకునేందుకు తీవ్రంగా కష్టపడుతోంది.

Story first published: Monday, October 29, 2018, 11:48 [IST]
Other articles published on Oct 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+