Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: 65 ఏళ్లలో ఇదే తొలిసారి!

టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. 65 ఏళ్ల తర్వాత వెస్టిండీస్‌పై వరుసగా ఐదు వికెట్లకు 50 ప్లస్ భాగస్వామ్యాలను నమోదు చేసిన జట్టుగా భారత్ అరుదైన రికార్డ్‌ నమోదు చేసింది. వెస్టిండీస్‌తో న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఈ ఫీట్ సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో టీమిండియా టాప్-5 బ్యాటర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, నితీష్ కుమార్ రెడ్డి, ధృవ్ జురెల్ వరుసగా ఐదు వికెట్లకు 50+ రన్స్ పార్ట్‌నర్‌షిప్స్ అందించారు.

తొలి వికెట్‌కు రాహుల్-జైస్వాల్ 58, రెండో వికెట్‌కు జైస్వాల్-సాయి సుదర్శన్ 193, మూడో వికెట్‌కు జైస్వాల్-శుభ్‌మన్ గిల్ 69, నాలుగో వికెట్‌కు శుభ్‌మన్ గిల్-నితీష్ కుమార్ రెడ్డి 91, ఐదో వికెట్‌కు శుభ్‌మన్ గిల్-ధ్రువ్ జురెల్ 102 పరుగుల భాగస్వామ్యాలను నమోదు చేశారు.

India Breaks 65-Year-Old Test Record vs West Indies with Five Consecutive 50 Partnerships

65 ఏళ్లలో ఇదే తొలిసారి..

1960 తర్వాత వెస్టిండీస్ జట్టుపై ఒక టీమ్ వరుసగా ఐదు వికెట్లకు 50 ప్లస్ రన్స్ పార్ట్‌నర్‌షిప్స్ నమోదవ్వడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డ్‌ను వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా నమోదు చేసింది. 1960లో బ్రిస్బేన్ వేదికగా జరిగిన గబ్బా టెస్ట్‌లో ఆసీస్ ఈ ఫీట్ సాధించింది.

టీమిండియాకు మూడోసారి..

93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా ఈ ఫీట్ సాధించడం మూడో సారి. 1993లో తొలిసారి, 2023లో ఆస్ట్రేలియాపై రెండో సారి టీమిండియా వరుసగా 5 వికెట్లకు 50 ప్లస్ రన్స్ భాగస్వామ్యాలను నమోదు చేసింది. తాజాగా మరోసారి ఈ ఫీట్ అందుకుంది.

పట్టుబిగించిన భారత్..

ఈ మ్యాచ్‌లో టీమిండియా పట్టు బిగించింది. రవీంద్ర జడేజా(3/98) తీన్మార్ బౌలింగ్‌తో రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. షైహోప్(46 బంతుల్లో 5 ఫోర్లతో 31 బ్యాటింగ్), టెవిన్ ఇమ్లాచ్(14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జడేజాతో పాటు కుల్దీప్ ఒక వికెట్ తీసాడు. విండీస్ ఇంకా 378 పరుగుల వెనుకంజలో ఉంది.

అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 134.2 ఓవర్లలో 5 వికెట్లకు 518 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(258 బంతుల్లో 22 ఫోర్లతో 175), శుభ్‌మన్ గిల్(196 బంతుల్లో 2 సిక్స్‌లతో 16 ఫోర్లతో 129 నాటౌట్) శతకాలతో చెలరేగారు. నితీష్ కుమార్ రెడ్డి(54 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), ధ్రువ్ జురెల్(79 బంతుల్లో 5 ఫోర్లతో 44), కేఎల్ రాహుల్(54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 38) హాఫ్ సెంచరీలు చేజార్చుకున్నారు. వెస్టిండీస్ బౌలర్లలో జొమెల్ వారికన్(3/98) మూడు వికెట్లు తీయగా.. రోస్టన్ ఛేజ్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Saturday, October 11, 2025, 17:50 [IST]
Other articles published on Oct 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+