For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే కేఎల్ రాహుల్ విఫలమవుతున్నాడు.. అతనికి అండగా నిలవాలి: టీమిండియా బ్యాటింగ్ కోచ్

India batting coach Vikram Rathour says KL Rahul is one of our main players
Ind vs Eng 3rd T20I:KL Rahul Is Our Best T20 Batsman,3 Failures Won’t Change Anything:Vikram Rathour

అహ్మదాబాద్‌: శారీరక బద్దకం కారణంగానే కేఎల్ రాహుల్ విఫలమవుతున్నాడని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. అయితే ఓ మూడు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైనంత మాత్రాన అతను టీమిండియా అత్యుత్తమ టీ20 బ్యాట్స్‌మన్‌ కాకుండా పోడన్నాడు. ఫామ్‌లేమితో సతమతం అవుతున్న అతనికి అండగా నిలవాలని సూచించాడు. రోహిత్‌తో ఓపెనింగ్‌ చేసేందుకు రాహులే అత్యుత్తమం అన్న కోహ్లీ వ్యాఖ్యలతో రాథోడ్ ఏకీభవించాడు. మూడో టీ20 ఓటమి తర్వాత ఆయన మీడియాతో మాట్లాడాడు.

పుంజుకుంటాడు..

పుంజుకుంటాడు..

'అందరు క్రికెటర్లు ఇలాంటి గడ్డు దశను అనుభవిస్తారు. కానీ టీ20 ఫార్మాట్లో రాహుల్‌ మా అత్యుత్తమ ఆటగాడు. అతని సగటు 40, స్ట్రైక్‌రేట్‌ 145కు పైగా ఉంది. మూడు సార్లు విఫలమైనంత మాత్రాన అతను అత్యుత్తమ ఆటగాడు కాకుండా పోడు. ఇలాంటి సమయంలోనే మేం అతనికి అండగా ఉండాలి. అతను త్వరగా పుంజుకుంటాడన్న నమ్మకం మాకుంది' అని విక్రమ్‌ రాథోడ్‌ అన్నాడు.

ఒక్క మంచి షాట్‌‌తో..

ఒక్క మంచి షాట్‌‌తో..

రాహుల్‌ వైఫల్యానికి బహుశా శారీరక బద్దకం కారణం కావొచ్చని రాథోడ్‌ అంగీకరించాడు. ఒక మంచి షాట్‌తో అతను ఫామ్‌లోకి వస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. 'నిరంతరంగా ఆడకపోతే బద్దకం ఆవహిస్తుందన్నది నిజమే. సరైన మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభిస్తే మెరుగవుతారు. ఆటగాళ్లను నెట్స్‌లో విపరీతంగా సాధన చేయిస్తున్నాం. అలా శ్రమిస్తూ ఒక మంచి షాట్‌ ఆడితే పుంజుకోవచ్చన్న విశ్వాసం ఉంటే చాలు. వారు ఫామ్‌లోకి వస్తారు. కేఎల్‌ రాహుల్‌ సైతం అంతే' అని రాథోడ్‌ పేర్కొన్నాడు. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో కేఎల్‌ వరుసగా 1, 0, 0కే ఔటైన సంగతి తెలిసిందే.

సరైన టార్గెట్..

సరైన టార్గెట్..

పిచ్‌ భిన్నంగా ఉండటంతో సరైన స్కోరేదో అంచనా వేయలేక పోతున్నామని విక్రమ్‌ చెప్పుకొచ్చాడు. 'బ్యాటింగ్‌ ఆరంభించినప్పుడు బౌన్స్‌ ఇబ్బందిగా మారుతోంది. బౌన్స్‌లోనూ వైవిధ్యం కనిపిస్తోంది. అందుకే ఇలాంటి పిచ్‌లపై ఎంత స్కోరు చేస్తే మంచిదో అర్థం కావడం లేదు. మేము ఆడిన ప్రతి పిచ్‌ భిన్నంగా ఉంటుంది. మూడు మ్యాచులు ముగిసాయి. ఇకపై మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్‌ చేస్తే మెరుగైన స్కోర్‌ చేస్తాం'అని రాథోడ్ ధీమా వ్యక్తం చేశాడు.

రాహుల్ మ్యాచ్ విన్నర్..

రాహుల్ మ్యాచ్ విన్నర్..

వరుసగా విఫలమవుతున్న కేఎల్ రాహుల్‌‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అండగా నిలిచాడు. అతనో మ్యాచ్‌ విన్నరని కొనియాడాడు. టీ20 ఫార్మాట్‌లో రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనింగ్‌ చేసేందుకు రాహులే సరైనోడు అని స్పష్టం చేశాడు. 'రెండ్రోజుల క్రితం వరకు నేనూ ఫామ్‌లో లేను. కేఎల్‌ రాహుల్‌ మ్యాచ్ విన్నర్. జట్టులో అతడో కీలక ఆటగాడు. రోహిత్ శర్మ‌తో కలిసి ఓపెనింగ్‌ చేస్తాడు. టీ20 ఫార్మాట్‌లో ఫామ్‌లోకి రావడమనేది ఐదారు బంతుల వ్యవహారమే. ఓపెనింగ్‌ చేసేందుకు రాహులే సరైనోడు' అని కోహ్లీ స్పష్టం చేశాడు. గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటన నుంచి వచ్చిన రాహుల్‌ నేరుగా ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. మధ్యలో మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించలేదు.

Story first published: Wednesday, March 17, 2021, 20:48 [IST]
Other articles published on Mar 17, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+