Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ శర్మపై ఒత్తిడా? నవ్వుతారు: టీమిండియా బ్యాటింగ్ కోచ్

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ ముగిసిందా..? లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగే మూడో వన్డే అతనికి చివరి మ్యాచ్? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల నుంచి రోహిత్ శర్మను తొలగించినట్లు భారత సెలెక్టర్లు అతనికి సమాచారమిచినట్లు వార్తలు వచ్చాయి.

అతని స్థానంలో యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లను ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తుందని, ఈ విషయాన్ని రోహిత్ శర్మకు తెలియజేసిందని కథనాలు వచ్చాయి. అయితే ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ అసంతృప్తిగా ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది.

India Batting Coach Sitanshu Kotak Dismisses Rohit Sharma Retirement Speculation

ఆ వార్తల్లో వాస్తవం లేదు..

అయితే ఈ వార్తలను టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ఖండించాడు. రిటైర్మెంట్‌ విషయంలో రోహిత్ శర్మపై టీమిండియా మేనేజ్‌మెంట్ ఎలాంటి ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. అయినా రోహిత్ శర్మపై ఒత్తిడి అంటే ఎవరైనా నవ్వుతారని ఈ వార్తలను కొట్టిపారేసారు.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కార్డిఫ్ వేదికగా గురువారం జరిగిన రెండో వన్డేలో సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. ఈ పరాజయం అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న సితాన్షు కోటక్‌ను రోహిత్ రిటైర్మెంట్ వార్తలపై ప్రశ్నించగా..వాటిని ఖండించాడు.

IND vs ENG: సామ్ కరణ్ X శ్రేయస్ అయ్యర్ మధ్య గొడవ!(వీడియో)

IND vs ENG: సామ్ కరణ్ X శ్రేయస్ అయ్యర్ మధ్య గొడవ!(వీడియో)

షాట్ సెలెక్షన్ బాలేదంతే..?

'రోహిత్ శర్మ లాంటి సీనియర్ ప్లేయర్‌పై ఈ తరహా ఒత్తిడి ఉంటుందని నేను అనుకోవడం లేదు. అతను కూడా ఒత్తిడి ఉందని ఫీలయ్యే ఆటగాడు ఏ మాత్రం కాదు. ఇంగ్లండ్‌తో తొలి రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ విఫలమయ్యాడు. అంతమాత్రానా అతని కెరీర్‌ ముగుస్తుందనడంలో అర్థం లేదు. రోహిత్ ఇబ్బంది పడటం లేదు. షాట్ సెలెక్షన్ సరిగ్గా లేదంతే. లార్డ్స్‌లో జరిగే మూడో వన్డేలో తప్పకుండా అతను మెరుగైన ప్రదర్శన చేస్తాడు.'అని సితాన్షు కోటక్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు కోహ్లీ-గంభీర్ మధ్య విభేదాలు ఉన్నట్లు వస్తొన్న వార్తలపైనా సితాన్షు కోటక్ స్పందించాడు. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశాడు. 'చాలా సార్లు ఇలాంటి ప్రచారం తెరపైకి వచ్చింది. కానీ, వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. రెండో వన్డే సమయంలోనూ వీరిద్దరూ కనీసం 10 సార్లు మాట్లాడుకొని ఉంటారు. ఇలాంటి పుకార్లు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కావల్లేదు.'అని సితాన్షు కోటక్ అసహనం వ్యక్తం చేశాడు.

రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 19న హిట్ మ్యాన్ ఆఖరి వన్డే?

రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 19న హిట్ మ్యాన్ ఆఖరి వన్డే?

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో 11 పరుగులు చేసిన అతను.. రెండో వన్డేలో 26 పరుగులే చేశాడు. గత 8 వన్డే మ్యాచ్‌ల్లో 30.1 సగటుతో కేవలం 241 పరుగులే చేశాడు. ఈ క్రమంలోనే అతన్ని భారత జట్టు నుంచి తప్పించాలని సెలెక్టర్లు నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి.

Story first published: Friday, July 17, 2026, 13:39 [IST]
Other articles published on Jul 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+