Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్-భారత్ తొలి టీ20కి 70 వేలా!!

India vs Australia 1st T20 : Huge Crowd Expected For India-Australia T20 Series | Oneindia Telugu
India-Australia T20s: 70,000 fans expected for MCG clash

హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా ఇరు జట్లు బలాబలాలు తేల్చుకోవడానికి వేళైంది. బుధవారం బ్రిస్బేన్ వేదికగా తొలి టీ20లో తలపడనుండగా ఇప్పటికే దాదాపు టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తోన్న సిరీస్‌ కావడంతో మ్యాచ్‌ టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే లక్షకు పైగా టికెట్లు విక్రయించారు. అమ్మకాలు ఇంకా పెరగొచ్చని మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. సిరీస్ మొత్తానికి 1,35,000 మంది వరకూ అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు రావొచ్చని అంచనా.

తొలి టీ20కి 70వేల మంది రావొచ్చని

తొలి టీ20కి 70వేల మంది రావొచ్చని

తొలి టీ20 బ్రిస్బేన్‌లో జరుగుతుండగా రెండో టీ20ని మెల్‌బోర్న్‌లో నిర్వహించేందుకు పూనుకున్నారు. ఇక మూడోది సిడ్నీలో నిర్వహించి ముగించనున్నారు. రెండో మ్యాచ్‌ జరిగే మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానం ప్రపంచంలోనే అతిపెద్దది. దాదాపు 70వేల అభిమానులు వస్తారని అంచనా. ఇక బ్రిస్బేన్‌కు 30 వేలు, సిడ్నీకి 35వేలు మంది ప్రేక్షకులు హాజరవుతారని అంటున్నారు. ఆస్ట్రేలియా, భారత్‌ క్రికెట్‌ పోరుకు విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది.

గిల్‌క్రిస్ట్‌తో కెప్టెన్ కోహ్లీ ముచ్చట్లు

స్మిత్‌, వార్నర్‌లపై నిషేధం పడటంతో

స్మిత్‌, వార్నర్‌లపై నిషేధం పడటంతో

నాలుగేళ్ల తర్వాత కోహ్లీసేన అక్కడ పర్యటిస్తుండటంతో అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియాలో గెలవడానికి ఇంతకంటే మంచి తరుణం మరొకటి లేదనేది మాజీలు, విశ్లేషకుల మాట. ప్రస్తుతమున్నంత బలహీనంగా కంగారూ జట్టు గతంలో ఎప్పుడూ లేదు. ఈ ఏడాది ఆరంభంలో బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం ఆస్ట్రేలియా క్రికెట్‌ను గట్టి దెబ్బే తీసింది. స్టీవెన్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లపై నిషేధం పడటంతో జట్టు బలహీనపడింది. టాంపరింగ్‌ వివాదం మొత్తం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది.

భారత్‌తో జరిగే మ్యాచ్‌లు అవకాశంగా భావించి

భారత్‌తో జరిగే మ్యాచ్‌లు అవకాశంగా భావించి

అప్పట్నుంచి ఆసీస్ ఆట దిగజారుతూ వచ్చి.. వరుస పరాభవాలు వెంటాడాయి. ఐతే సొంతగడ్డపై ఆస్ట్రేలియాను అంత తక్కువ అంచనా వేయలేం. తమ గడ్డపై సరైన రికార్డు లేని భారత్‌ను ఓడించి తిరిగి ఫామ్‌ అందుకోవాలని ఆ జట్టు చూస్తోంది. వన్డే ప్రపంచకప్‌‌కు ముందు తమ జట్టు తిరిగి పుంజుకోవడానికి ఈ సిరీస్‌నే ఓ అవకాశంగా భావిస్తోంది. సాధారణంగా ఆస్ట్రేలియాలో భారత పర్యటన టెస్టులతోనే మొదలవుతుంది కానీ.. ఈసారి కొంచెం భిన్నం.

బలంగా కనిపిస్తోన్న భారత జట్టు

బలంగా కనిపిస్తోన్న భారత జట్టు

టీ20 సిరీస్‌ జరిగిన తర్వాత టెస్టులు ఆడి.. చివరగా వన్డే సిరీస్‌లో తలపడుతుంది టీమ్‌ఇండియా. పొట్టి క్రికెట్‌ పోరు బుధవారమే ఆరంభం కానుంది. టీ20లంటే పిచ్‌లు, వాతావరణంతో పెద్దగా సంబంధం ఉండదు. పైగా భారత జట్టు కూడా బలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కోహ్లీసేన ఈ సిరీస్‌ గెలిచి టెస్టులకు ముందు ఆత్మవిశ్వాసాన్ని సాధిస్తారని యావత్ భారత అభిమానులు ఆశిస్తున్నారు.

Story first published: Tuesday, November 20, 2018, 9:39 [IST]
Other articles published on Nov 20, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+