
చెన్నై: టీమిండియా, సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఓ ఇంటివాడయ్యాడు. తమిళనాడుకే చెందిన వైశాలీ విశ్వేశ్వరన్‌ను బుధవారం చెన్నైలో పెళ్లి చేసుకున్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా కొద్దిమంది కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్.. తన అధికారిక ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. 'ఈ ప్రత్యేకమైన రోజున మా తరఫున విజయ్ శంకర్‌కు శుభాకాంక్షలు.. మీకు సంతోషకరమైన వివాహ జీవితం ఉండాలని కోరుకుంటున్నాం.'అని సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది.
ఇక విజయ్ శంకర్, వైశాలీల నిశ్చితార్థం గతేడాది ఆగస్టులోనే జరిగిన విషయం తెలిసిందే. వివాహ బంధంతో ఓ ఇంటివాడైన విజయ్ శంకర్‌కు టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్‌తో పాటు ఇతర ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు కూడా విజయ్ శంకర్‌కు విషెస్ తెలియజేస్తున్నారు.
విజయ్ శంకర్ 2018లో కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన టీ20తో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. మరుసటి ఏడాదే ఆస్ట్రేలియాపై మెల్‌బోర్న్‌లో వన్డే కెరీర్‌ను ఆరంభించాడు. ఇంగ్లండ్ వేదికగా 2019లో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లోనూ ఆడాడు. కానీ గాయంతో అర్థాంతరంగా టోర్నీని వీడాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 12 వన్డేలు ఆడిన ఈ తమిళనాడు క్రికెటర్.. 223 పరుగులతో పాటు 4 వికెట్లు తీశాడు. 9 టీ20ల్లో 101 రన్స్‌తో పాటు 5 వికెట్ల పడగొట్టాడు.