న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అక్షర్‌ పటేల్‌ మెరుపు ఇన్నింగ్స్.. చాహల్‌ మాయ.. దక్షిణాఫ్రికాపై భారత్‌ విజయం

IND vs SA 2019 : Axar Patel,Chahal Shine To Help India A Beat South Africa A By 69 Runs || Oneindia
India A vs South Africa A: Yuzvendra Chahal, Axar Patel help IND win by 69 runs

తిరువంతపురం: అక్షర్‌ పటేల్‌ (36 బంతుల్లో 60 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌కి తోడు కీలక సమయంలో లెగ్‌స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ (5/47) మాయ చేయడంతో దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన తొలి అనధికార వన్డేలో భారత్‌-ఎ 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్‌లో భారత్‌-ఎ శుభారంభం చేసింది.

బుమ్రా బౌలింగ్‌ చూస్తుంటే మా రోజులు గుర్తొస్తున్నాయి

గురువారం వర్షం కారణంగా మైదానం తడిగా ఉండడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 47 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ (10) విఫలమయినా.. మరో ఓపెనర్ శుభమాన్ గిల్ (46) జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ మనీష్ పాండే (39), ఇషాన్ కిషన్ (37) పర్వాలేదనిపించారు. కృనాల్ పాండ్యా త్వరగానే పెవిలియన్ చేరినా.. చివరలో శివం దూబె (60 బంతుల్లో 79 నాటౌట్‌; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), అక్షర్‌ పటేల్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో భారత్ భారీ స్కోర్ చేసింది.

అనంతరం దక్షిణాఫ్రికా-ఎ చహల్‌ స్పిన్‌ దెబ్బకు 45 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. సఫారీ జట్టు ఒక దశలో 208/5తో పటిష్ట నిలిచింది. హెండ్రిక్స్‌ (110), క్లాసన్‌ (58) దక్షిణాఫ్రికా జట్టులో ఆశలు రేపారు. కీలక సమయంలో చాహల్‌ మాయ చేయడంతో ప్రొటీస్ ఆలౌటైంది. అక్షర్‌కు రెండు వికెట్లు దక్కాయి. రీజా హెండ్రిక్స్‌ (108 బంతుల్లో 110; 12 ఫోర్లు, సిక్స్‌) ఒంటరి పోరాటం వృథా అయింది. ఆల్‌రౌండ్‌ షోతో ఆదరగొట్టిన అక్షర్‌కు ప్లేయర్‌ 'ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది. రెండో వన్డే ఈ నెల 31న జరగనుంది.

Story first published: Friday, August 30, 2019, 9:26 [IST]
Other articles published on Aug 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X